Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిషన్ తషాఫి లో తిరువీర్ క్యారెక్ట‌ర్‌ను అనౌన్స్ చేసిన జీ 5

Webdunia
సోమవారం, 24 జులై 2023 (10:00 IST)
Tiruveer
తిరువీర్‌ ఇప్పుడు త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఓ వైపు సినిమాల‌తో పాటు ఓటీటీ మాధ్య‌మంలోనూ తిరువీర్ రాణిస్తున్నారు. ఇప్పుడు టాప్ ఓటీటీ మాధ్య‌మాల్లో ఒక‌టైన జీ5 ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా రూపొందిస్తోన్న వెబ్ సిరీస్ ‘మిషన్ తషాఫి’లో ఆయ‌న ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. దానికి సంబంధించి జీ 5 అధికారిక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది.   ఎంగేజింగ్‌, థ్రిల్లింగ్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ప్ర‌ణ‌తి రెడ్డి నిర్మాత‌.
 
 ఇప్ప‌టికే రెగ్యుల‌ర్ షూటింగ్ అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం శ‌ర‌వేగంగా పూర్తవుతుంది. ఇప్పుడు వెర్స‌టైల్ యాక్ట‌ర్ తిరువీర్ ఈ టీమ్‌లో జాయిన్ కావ‌టంపై మేక‌ర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. తిరువీర్ బ‌ర్త్ డే సంద‌ర్బంగా ‘మిషన్ తషాఫి’లో ఆయ‌న న‌టిస్తున్నారంటూ జీ 5 అధికారికంగా ప్ర‌క‌టించింది.  తిరువీర్ విల‌క్ష‌ణ న‌ట‌న‌తో త‌న పాత్ర‌ను డైరెక్ట‌ర్ ఊహించిన దాని కంటే ఇంకా బెట‌ర్ ఔట్ పుట్ ఇస్తార‌ని మేక‌ర్స్‌ భావిస్తున్నారు. ప్ర‌వీణ్ స‌త్తారు వంటి డైరెక్ట‌ర్‌తో క‌లిసి ప‌ని చేయ‌టంపై తిరువీర్ సైతం ఎంతో ఆస‌క్తిగా ఉన్నారు. 
 
ఇండియా లో భారీ విధ్వంసాన్ని  సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఒక విదేశీ తీవ్రవాద సంస్థకి, ఇండియన్ RAW ఏజెంట్స్  కి మధ్య నడిచే బావోద్వేగమైన  హై ఇన్‌టెన్స్ యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ ఇది. 
 
8 ఎపిసోడ్స్ ఉన్న ‘మిషన్ తషాఫి’ వెబ్ సిరీస్‌ను  ఫిల్మ్ రిప‌బ్లిక్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌తి రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు ఓటీటీలో ఎవ‌రూ నిర్మించని రీతిలో జీ 5 దీన్ని భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో రూపొందిస్తోంది. అంతే కాకుండా ఇప్ప‌టి వ‌ర‌కు ఓ తెలుగు వెబ్ సిరీస్‌ను ఫారిన్ లొకేష‌న్స్‌లో చిత్రీక‌రించ‌లేదు. కానీ తొలిసారి ‘మిషన్ తషాఫి’ సిరీస్‌ను విదేశాల్లో కూడా చిత్రీక‌రిస్తున్నారు. అలాగే ఇంట‌ర్నేష‌న‌ల్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్స్ నేతృత్వంలో ఫైట్స్‌ను చిత్రీక‌రిస్తున్నారు డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌ను ఆ విషయంలో ఫాలో అవుతున్న పవన్.. ఏంటది?

పవన్ కల్యాణ్ అనే నేను పిఠాపురం అభివృద్ధికోసం ఆఖరి శ్వాస వరకూ... (video)

డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా వస్తాయి.. అప్పుడే నన్ను ఊరేగించండి: పవన్ (video)

షాకింగ్ వీడియో : లోనావాలా జలపాతంలో కొట్టుకుపోయిన ఓ కుటుంబం (Video)

సెల్ఫీ వీడియో కోసం వాటర్ ఫాల్స్‌‍లో దూకిన మాజీ ఆర్మీ జవాన్.. రెండు తర్వాత... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments