Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వక్ సేన్ VS10 ఆగస్ట్ 6న గ్లింప్స్ తో టైటిల్ అనౌన్స్ మెంట్

Webdunia
సోమవారం, 24 జులై 2023 (09:39 IST)
Viswak sen
హీరో విశ్వక్ సేన్ మైల్ స్టోన్ మూవీ #VS10 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మొదటి షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది, రెండవ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడిగా మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది.
 
ఆగస్ట్ 6 ఉదయం 11:11 గంటలకు సినిమా టైటిల్‌ను ఒక గ్లింప్స్ ద్వారా అనౌన్స్ చేస్తామని మేకర్స్ ఈరోజు అప్‌డేట్ ఇచ్చారు. '“High torque engine starts soon. ఆగస్ట్ 6వ తేదీ ఉదయం 11:11 గంటలకు గ్లింప్స్ తో #VS10 టైటిల్ అనౌన్స్ మెంట్ ” అని పోస్టర్ పై రాసుంది. పోస్టర్ లో విశ్వక్ సేన్ ఇంటెన్స్ లుక్ లో కనిపించారు. ఈ చిత్రం కోసం విశ్వక్ స్టైలిష్ గా మేక్ఓవర్ అయ్యారు. గడ్డం, గిరజాల జుట్టుతో కనిపిస్తున్నారు.
 
ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ని త్వరలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. మనోజ్ కాటసాని కెమెరామెన్ గా పని చేస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యుసర్స్.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాలేగావ్ స్కూటర్ బాంబు పేలుళ్ళ కేసు : నిందితులంతా నిర్దోషులే...

పక్కింటికి ఆడుకోవడానికి వెళ్తే.. అన్నయ్యతో పాటు బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం

13 ఏళ్ల బాలికను 40 ఏళ్ల వ్యక్తికిచ్చి వివాహం, అత్తారింటికి వెళ్లనన్న బాలిక

మరో యువకుడితో సహజీవనం చేస్తూ ప్రియుడు పట్టించుకోలేదనీ...

తల్లిబాట పథకం : గిరిజనులకు రగ్గులు పంపిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments