Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లగా ఉన్నావు... సినిమాలలో ఎలా రాణిస్తావు? అని అడిగేవారు.. రోజా

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (19:00 IST)
నటి రాజకీయ నాయకులు రోజా తన సినీ, రాజకీయ కెరీర్ గురించి స్పందించారు. తాజాగా రోజా ఓ వైపు ప్రజలకు సేవలందిస్తూనే.. జబర్దస్త్, బతుకు జెట్కా బండి వంటి షోలతో తెలుగు వారిని అలరిస్తూ ఉంటుంది. అంతేకాదు రోజా తెలుగులో అగ్ర హీరోయిన్‌గా కూడా రాణించింది. కొన్ని సంవత్సరాల పాటు ఆమె తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.
 
సినిమాల్లో రాణించేందుకు తెల్లగా వుండాలని, తాను నలుపుగా వున్నానని అవహేళన చేశారని రోజా తెలిపారు. తన శరీర చాయ గురించి కొందరు అవహేళనగా మాట్లాడారని తెలిపింది. రోజా తాజాగా చెన్నైలో సౌతిండియా సినీ, టీవీ మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమానికి రోజా హాజరైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన శరీర రంగు గురించి కొందురు వ్యక్తులు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. 
 
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. 'నల్లగా ఉన్నావు... సినిమాలలో ఎలా రాణిస్తావు?' అని తనను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో కొందరూ కామెంట్ చేసేవారని... అయితే మేకప్ మెన్లు తనకు కాస్త రంగు వేసి చాలా అందంగా చూపించారని ఆమె చెప్పారు. మేకప్ ఆర్టిస్టుల కారణంగానే తాను వెండితెరపై అందంగా కనిపించానని పేర్కోంది. తమిళ సినీ పరిశ్రమ తనకు పుట్టినిల్లు వంటిదని చెప్పింది.
 
ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాను ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నానని రోజా ఈ సందర్భంగా తెలిపింది. దివంగత జయలలితను తలచుకుంటే ఎంతో ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతుందని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments