సినీనటి లక్ష్మీరాయ్ ఇటీవలే కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. గతేడాది తన తండ్రి క్యాన్సర్ కారణంగా మరణించారు. నాన్నను కోల్పోవడంతో తాను సర్వం కోల్పోయానని లక్ష్మీరాయ్ తెలిపింది.
మానసికంగా కుంగిపోయిన సమయంలో కరోనా బారిన పడటం.. ఐసోలేషన్‌లో ఉండటం తనను తీవ్రంగా కుంగదీసిందని పేర్కొంది. ఈ క్రమంలో చాలా క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొన్నానని, ఆ కష్టాలు తాను ఎప్పుడూ పడలేదని చాలా బాధగా వివరించింది. ప్రస్తుతం పలు సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌లలోను నటిస్తున్నానని లక్ష్మి రాయ్ తెలిపింది.
కాగా హీరోయిన్ రాయ్ లక్ష్మి తెలుగు, తమిళంలో నటించి బాలీవుడ్‌లోను అవకాశాలు కొట్టేసింది. అయిన ఆమెను ప్రత్యేక గీతాల్లో చూపించేందుకే దర్శకులు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో అడపాదడపా సినిమాలు చేసుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే.