Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్టీఆర్, వైఎస్సార్‌లపై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్..

webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (10:33 IST)
poonam kaur
టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు, ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిలను ఉద్దేశించి కామెంట్స్ పెట్టారు. 
 
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు పెద్ద అభిమానిగా టాలీవుడ్‌లో గుర్తింపు ఉన్న పూనమ్ కౌర్.. ఆ ఇద్దరు దివంగత నేతలను ఉద్దేశించి.. తాజాగా చేసిన ట్వీట్లు సంచలనం రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ.. ఆయన ప్రస్తావన లేకుండా ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
 
ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మానవత్వం మూర్తీభవించిన నాయకులని ఆమె పేర్కొన్నారు. ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తల పాగా ధరించిన ఫొటోలను పోస్ట్ చేశారు. ఫార్మర్స్ మిస్ యూ అని కామెంట్స్ చేశారు. లవ్ ఎమోజీలను వాటికి జత చేశారు. అలాగే- తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రస్తావన కూడా తీసుకొచ్చారు.
 
కేసీఆర్ అంటే తనకు గౌరవభావం ఉందని పేర్కొన్నారు. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, యోగి ఆదిత్యనాథ్, కేప్టెన్ అమరీందర్ సింగ్ పేర్లను తన ట్వీట్‌లో ప్రస్తావించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ కారణాలు, ఉద్దేశాలను పక్కన పెట్టాలని వేడుకొన్నారు. 

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

సాగర సంగమం ఛాయాగ్రాహకుడు పీఎస్‌ నివాస్‌ కన్నుమూత