Webdunia - Bharat's app for daily news and videos

Install App

వై.ఎస్‌. జ‌గ‌న్ నుంచి చిరంజీవికి ఆహ్వానం- ఈనెలాఖ‌రున భేటీ

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (20:19 IST)
perni nani- with chiru-nag etc
క‌రోనా వేవ్ తగ్గుముఖం ప‌ట్ట‌డంతో థియేట‌ర్లు తెరిచేందుకు ఎగ్జిబిట‌ర్లు సిద్ధ‌మైనా ఏపీలో టిక్కెట్టు ధ‌ర స‌మ‌స్యాత్మ‌కం అయిన సంగ‌తి తెలిసిందే. స‌వ‌రించిన ధ‌ర‌ల‌తో ఎగ్జిబిష‌న్, పంపిణీ రంగాలు చిక్కుల్లో ప‌డ్డాయి. థియేట‌ర్ల స‌మ‌స్య చాలాకాలంగా ఓ కొలిక్కి రాలేదు. సీఎం జ‌గ‌న్ తో భేటీ కోసం సినీపెద్ద‌లు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి.
 
ఏపీ మంత్రి పేర్ని నాని నేరుగా మెగాస్టార్  చిరంజీవికి  శనివారం రోజు ఫోన్ చేసి , సినీపెద్ద‌ల‌తో క‌లిసి వ‌చ్చి ప్రస్తుత స‌మ‌స్య వివరిచ్చాల్సిదిగా చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి తరపున మంత్రి పేర్ని నాని ఆహ్వానించారు.
 
ఈ కీల‌క భేటీలో ప్ర‌స్తుతం ఉన్న థియేట‌ర్ల స‌మ‌స్య గురించి, ఈ రంగంపై ఆధార‌ప‌డి జీవిస్తున్న కార్మికుల బ‌తుకు తెరువు స‌హా.. పంపిణీ వ‌ర్గాల వేతనాల గురించి మాట్లాడే అవ‌కాశం ఉంది. చిరంజీవితో పాటు సినీ పరిశ్రమకు చెందిన  కొంద‌రు హాజరు కానున్నారు. ఇంత‌కుముందు సీఎంతో భేటీ లో చిరంజీవి- నాగార్జున - రాజ‌మౌళి- సురేష్ బాబు బృందం స‌మ‌స్య‌లు విన్న‌వించగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే.
 
అలాగే గతంలో పరిశ్రమ కు అనుకూలంగా  సియం జగన్ ఎప్పుడు వరాలు ఇచ్చినా , చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపిన సందర్భాలున్నాయి .. ఇప్పుడు ఈ భేటీ ఈనెల చివరి వారంలో జరగనుంది , ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈసారి స‌మ‌స్య‌కు త‌క్ష‌ణ పరిష్కారం చూపిస్తార‌నే అంతా ఆకాంక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానం ఎక్కబోయే యువతి అండర్‌వేర్‌లో లైటర్స్: శంషాబాద్ విమానాశ్రయానికి రెడ్ అలెర్ట్

Jalgaon Train Accident: జల్గావ్ జిల్లా ఘోర రైలు ప్రమాదం.. 20మంది మృతి

అమ్మా... అత్తయ్య నాపై అత్యాచారం చేసింది: తల్లి వద్ద విలపించిన బాలుడు

Mahakumbh 2025: ప్రయాగ్ రాజ్‌లో రాడార్ ఇమేజింగ్ శాటిలైట్.. ఇది ఏం చేస్తుందో తెలుసా?

మావోయిస్టు అగ్రనేత చలపతి ప్రాణాలు తీసిన సెల్ఫీ.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

తర్వాతి కథనం
Show comments