Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచి మనిషి జన్మదినాన ఒక మంచి పని : ఆర్కే రోజా

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (11:02 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు సోమవారం వైకాపా శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ బర్త్‌డేను పురస్కరించుకుని వివిధ రకాలైన సమాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా, ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఓ మంచి పని చేశారు. 
 
'మంచి మనిషి జన్మదినాన ఒక మంచి పని..! మన అందరి ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టడం జరిగింది. పి.పుష్పకుమారి అనే ఈ చిన్నారి పూర్తి చదువుకు నేను దత్తత తీసుకోవడం జరిగింది' అంటూ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలియజేశారు. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెట్టారు.
 
కాగా రోజా దత్తత తీసుకున్న బాలిక... చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. ప్రస్తుతం ఆమె తిరుపతిలోని బాలికల హోంలో ఉంటూ మెడిసిన్ చదవాలన్న తన కలను సాకారం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న పుష్పకుమారి అనే బాలికను రోజా దత్తత తీసుకున్నారు. 
 
ఆమె చదువుకు అయ్యే ఖర్చుతో పాటు భవిష్యత్తులో అన్ని రకాలుగా సాయం చేస్తానని రోజా అన్నారు. లక్షలాది మంది చిన్నారులకు మేనమామగా ఉంటూ వారి విద్యకు సహకరిస్తున్న జగనన్నకు తానిచ్చే పుట్టిన రోజు బహుమతి ఇదే అంటూ రోజా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ పర్యటనలో జేడీ వాన్స్.. అక్షరధామ్ ఆలయంలో వాన్స్ ఫ్యామిలీ

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

love failure: హోటల్ గదిలో యువకుడి ఆత్మహత్య.. లవ్ ఫెయిల్యూరే కారణమా?

హరిద్వార్ రోడ్డుపై తాగుబోతు మహిళ రుబాబు (video)

22న మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments