Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుత్తూరులో రోజా ఆ రోగుల కోసం ఆసుపత్రి ప్రారంభం

Advertiesment
పుత్తూరులో రోజా ఆ రోగుల కోసం ఆసుపత్రి ప్రారంభం
, బుధవారం, 28 అక్టోబరు 2020 (17:27 IST)
సొంత నియోజకవర్గం నగరిలో చురుగ్గా పర్యటిస్తున్నారు రోజా. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే పనిలో ఉన్నారు. తాజాగా రోజా పుత్తూరు పట్టణంలో నిరుపేదల కోసం సంజీవని కేరళ ఆయుర్వేద ఆసుపత్రిని ప్రారంభించారు.
 
పుత్తూరులో పక్షపాత రోగుల కోసం ప్రత్యేకంగా ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. గతంలో పక్షవాతం వస్తే వివిధ ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చేది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేరళ ఆయుర్వేద ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రిని ప్రారంభించిన రోజా నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.
 
ప్రజల సౌకర్యార్థం ఏర్పాటైన ఆసుపత్రిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైద్యానికి రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఈ సంధర్భంగా చెప్పారు రోజా. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫేస్‌బుక్ నుంచి కొత్త ఫీచర్.. ఇన్‌స్టా నుంచి ఎఫ్‌బీకి అలా మెసేజ్‌లు పంపొచ్చు..