Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిభావంతులను ప్రోత్సహించటమే యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ లక్ష్యం : రామ్ గోపాల్ వర్మ

డీవీ
శుక్రవారం, 14 జూన్ 2024 (18:52 IST)
RGV, ravi
చిత్ర పరిశ్రమలోకి రావాలనుకునే యువ ప్రతిభావంతులను ప్రోత్సహించడమే తమ ఆర్జీవీ యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ లక్ష్యమని అన్నారు ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవీ యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ వివరాలను ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో రామ్ గోపాల్ వర్మ వివరించారు. ఈ కార్యక్రమంలో పోటీకి ఎంపికైన షార్ట్ ఫిలింస్ మేకర్స్, ఆర్జీవీ డెన్ ప్రొడ్యూసర్ రవి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఈ కాంటెస్ట్ కు ఎంట్రీలు రావడం విశేషం.  
 
దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ - మొదటి సినిమా శివ సమయంలో నా గురించి ఎవరికీ తెలియదు. శివ సినిమా ప్రేక్షకాదరణ పొందింది కాబట్టి రామ్ గోపాల్ వర్మ అంటే ఎవరో అందరికీ తెలిసింది. కానీ ప్రతిభ ఉండి నాలా ఇంకా ప్రపంచానికి తెలియాల్సిన వారు ఎంతోమంది ఉన్నారు. మా నాన్న అన్నపూర్ణ స్టూడియోలో సౌండ్ ఇంజినీర్ కాబట్టి నాకు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేందుకు వీలు దొరికింది. వచ్చాక నేను ఏం చేశాను అనేది తర్వాత విషయం. ముందు మన కాన్సెప్ట్ చెప్పేందుకు ఎవరో ఒకరు అవకాశం ఇవ్వాలి కదా. వివిధ ప్రాంతాల్లో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తమలో ఎంతో ప్రతిభ ఉండి కూడా అవకాశాలు పొందలేకపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారికి ఇండస్ట్రీతో ఒక యాక్సెస్ ఇచ్చే ఉద్దేశంతో నిర్వహిస్తున్న కాంటెస్ట్ ఆర్జీవీ యువర్ ఫిల్మ్.

ఈ కాంటెస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత దాదాపు 400 ఎంట్రీలు వచ్చాయి. ఇవి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఉన్నాయి. వీటిలో 11 షార్ట్ ఫిలింస్ షార్ట్ లిస్ట్ చేసి ఎంపికచేశాం. నార్త్ ఇండియా నుంచి కూడా వచ్చాయి గానీ అవి షార్ట్ లిస్ట్ కాలేదు. షార్ట్ లిస్ట్ అయిన వాటిని సోషల్ మీడియాలో పోల్ కు పెట్టి ప్రేక్షకులు ఎక్కువమంది బెస్ట్ డైరెక్టర్ గా ఓటు వేసిన వారికి మా సంస్థలో అవకాశం ఇస్తాం. పేర్లు చెప్పను గానీ ఇప్పటికే వీరిలో నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేశాను. వారికి సినిమా అవకాశం ఇవ్వబోతున్నాం. ఒక్క డైరెక్టర్స్ అనే కాదు. డీవోపీ, మ్యూజిక్ డైరెక్షన్ ఇలా..ప్రతి క్రాఫ్టులో టాలెంటెడ్ వారిని సెలెక్ట్ చేస్తున్నాం. ఈ పోల్ కు రెండు వారాల టైమ్ తీసుకుంటాం. ఈ షార్ట్ ఫిలింస్ చేసిన వారు నాకంటే బాగా డైరెక్ట్ చేశారు. ఈ షార్ట్ ఫిలింస్ లో మీరు ప్రొడక్షన్ వ్యాల్యూస్ చూడొద్దు. కాన్సెప్ట్ ను ఎంతబాగా కన్వే చేశారనేది మాత్రం చూడమని కోరుతున్నా. ఎందుకంటే మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాలు చూసిన మీకు వీరు అతి తక్కువ రిసోర్సెస్, బడ్జెట్ లో చేసిన మూవీస్ నచ్చకపోవచ్చు. కానీ వారి కాన్సెప్ట్ మేకింగ్ ఆకట్టుకుంటే చాలు. ఈ కాంటెస్ట్ లో సెలెక్ట్ అయిన వారి ప్రతిభను ముందుగా మా సంస్థలో ఉపయోగించుకోవాలనేది నాది, ప్రొడ్యూసర్ రవి గారి స్వార్థం. అంతేగానీ వీళ్లందరికీ అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలనేది ఒక్కటే ఆలోచన కాదు. ఆ తర్వాత వాళ్లు మమ్మల్ని వదిలేసి వెళ్తారనే విషయం కూడా తెలుసు. ఎవరికైనా మొదటి అవకాశం దొరకడం ముఖ్యం ఆ తర్వాత వాళ్లను వాళ్లు ప్రూవ్ చేసుకుని కెరీర్ లో  ముందుకెళ్లాల్సిఉంటుంది. అన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments