Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా పార్టీ నేతలు రంగంలోకి దిగుతున్నారు.. ఏమైనా జరగొచ్చు : డీకే శివకుమార్

Advertiesment
dk shivakumar

వరుణ్

, బుధవారం, 5 జూన్ 2024 (11:53 IST)
తమ పార్టీ నేతలు రంగంలోకి దిగుతున్నారని, అందువల్ల ఏమైనా జరగొచ్చని కర్నాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ అన్నారు. మంగళవారం వెలువడిన సార్వత్రక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కూటమి దాదాపు 230కి పైగా సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ కూడా 240 సీట్లకే పరిమితమైంది. దీంతో కేంద్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. దీనిపై డీకే శివకుమార్ స్పందిస్తూ,  బీజేపీ నిరాశాజనక ఫలితాలు నమోదు చేయడంపై కర్ణాటక డిప్యుటీ సీఎం, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'తమ నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు, భారత రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు' అని అన్నారు.
 
మంగళవారం మీడియా సమావేశంలో శివకుమార్ పలు అంశాలపై మాట్లాడారు. 'బీజేపీ తనంతట తానుగా మెజారిటీ సాధించడంలో విఫలమైంది. ప్రజలు ఇచ్చిన తీర్పును వారు అంగీకరించాలి. మహారాష్ట్రలో పార్టీలను చీల్చే రాజకీయాలను ప్రజలు తిరస్కరించారు. భావోద్వేగ రాజకీయాలను తిప్పికొట్టారు. 400 సీట్లను సాధిస్తామన్న బీజేపీ చాలా వెనకబడింది. నరేంద్ర మోడీ పాప్యులారిటీ హిందీ బెల్ట్‌లో కూడా తగ్గిందని ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయి. తనకు మెజారిటీ రాలేదన్న విషయాన్ని బీజేపీ అంగీకరించాలి. గత ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకున్న పార్టీ ఈసారి 240 సీట్లకే పరిమితమైంది, ఇక బీజేపీకి ఇతర పార్టీలపై ఆధారపడక తప్పదు అని అన్నారు. 
 
అలాగే, కాంగ్రెస్ పార్టీ పార్టీ 100 మార్కును సమీపించింది. మా పార్టీపై ప్రజలకు విశ్వాసముంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, మల్లికార్జున్ ఖర్గే నిరంతర శ్రమ కారణంగా కాంగ్రెస్ పునరుత్తేజితమైంది. ప్రియాంక గాంధీ పాత్ర కూడా కీలకమే. కర్ణాటక ప్రజల మాకు పలు సీట్లల్లో విజయం చేకూర్చారు. మా సీట్ల సంఖ్య 1 నుంచి 9కి చేరింది. అయితే, మేము 14 సీట్లు వస్తాయని భావించాము అని తెలిపారు. ప్రజాకర్షక గ్యారెంటీ ఫథకాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ కిట్టూర్ కర్ణాటక, బెంగళూరులో ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇకపై నా పేరు పద్మనాభ రెడ్డి, గెజిట్ సిద్ధం చేసాను: ముద్రగడ పద్మనాభం (video)