Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చాందిని చౌద‌రి, అజ‌య్ ఘోష్ ల మ్యూజిక్ షాప్ మూర్తి రివ్యూ

Music Shop Murthy

డీవీ

, శుక్రవారం, 14 జూన్ 2024 (15:23 IST)
Music Shop Murthy
అజ‌య్ ఘోష్‌, చాందిని చౌద‌రి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ నేడే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఆశయానికి వయస్సుతో సంబంధంలేదంటూ తెలియజెప్పే సందేశంగా మొదటినుంచి చిత్ర యూనిట్ చెబుతోంది. శివ పాల‌డుగు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
పల్నాడులో ఓ గ్రామంలో యాభై రెండేళ్ళ మూర్తి (మ్యూజిక్ షాప్) నడుపుతుంటాడు. ఎప్పటినుంచో నడుపడంతోపాటు మారిన సాంకేతికతో పోటీపడలేక అలానే నడుపుతుంటాడు. మరోవైపు మూర్తి భార్య ఆమని కూడా పిండివంటలు చేస్తూ సంసారాన్ని సాకుతుంది. లాభంలేని వ్యాపారం మ్యూజిక్ షాప్ తీసేసి మొబైల్ షాప్ పెట్టమని మూర్తిని కోరుతుంది. కానీ ఈ వయస్సులో అవన్నీ నేర్చుకోవడం కష్టమనీ, తనకు వచ్చిన మ్యూజిక్ షాప్ ద్వారానే ఓ ఫంక్షన్ లో కొందరు ఇచ్చిన సూచన మేరకు డిజె. అవ్వాలనుకుంటాడు మూర్తి. అందుకు ఆన్ లైన్ లో డిజె కోర్సు నేర్చుకునేందుకు ట్రై చేస్తాడు.
 
ఇదిలా వుండగా మరోవైపు అమెరికా నుంచి వచ్చిన అంజన (ఛాందీని చౌదరికి) డి.జె. అల్వాలనే గోల్ వుంటుంది. తన తండ్రి భానుచందర్ కు నచ్చకపోయినా అదే చేస్తానని పట్టుబడుతుంది. ఈ క్రమంలో సంజన, మూర్తి ఒకరినొకరు పరిచయం కావడం డిజె అవ్వాలనే కోరిక వ్యక్తం చేయడం జరుగుతుంది.దాంతో అంజన దగ్గర మూర్తి డిజె కోర్సు నేర్చుకుంటుంటాడు. ఇక ఆ తర్వాత వారిద్దరి జీవితాల్లో ఏ సంఘటనలు చోటు చేసుకున్నాయనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
ఈ కథ ఒకప్పుడు పాతికేళ్ళ వాళ్ళు ఇప్పటికి యాభై దాటితో వారి ఆలోచనలు మారుతున్న కాలానికి అనుగుణంగా వుండవు. చాలామందికి ఇది రిఫ్లక్ట్ అవుతంది. కొన్ని గ్రామాల్లో టైప్ ఇన్ స్టిట్యూట్ లు నడిపేవారు కంప్యూటర్లు వచ్చాక అదినేర్చు కోలేక తమకు వచ్చిన దానితో జిరాక్స్ సెంటర్లుగా నడుపుతున్న కథలు చాలా వున్నాయి. అలాంటి కథే మూర్తిది. కానీ తనకు డిజె అవ్వాలనేదే కొత్త పాయింట్. పాతికేళ్ళ అమ్మాయి గురువుగా భావించడంతో కథ రసవత్తరంగా సాగుతూ ఎంటర్ టైన్ తో పాటు ఆసక్తిని కనబరుస్తుంది.
 
 
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువ‌గా త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లోనే తెర‌కెక్కుతుంటాయ‌ని, తెలుగులో రావ‌ని చెబుతుంటారు. అలాంటి వారికి ఓ స‌మాధానంగా మ్యూజిక్ షాప్ మూర్తి నిలుస్తుంది. మ్యూజిక్ షాప్ మూర్తి రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా మాత్రం కాదు. క‌థ పాత‌దే అయినా ట్రీట్‌మెంట్ మాత్రం కొత్త‌గా ఉంటుంది.
 
ఏజ్ అన్న‌ది ఓ నంబ‌ర్ మాత్ర‌మే...
ల‌క్ష్యానికి వ‌య‌సు ఏ మాత్రం అడ్డంకి కాద‌ని, ఏజ్ అన్న‌ది జ‌స్ట్ ఓ నంబ‌ర్ మాత్ర‌మేన‌ని సందేశాన్ని మ్యూజిక్ షాప్ మూర్తి ద్వారా ఇచ్చారు ద‌ర్శ‌కుడు. సందేశం పేరుతో లెక్చ‌ర్ ఇస్తున్న‌ట్లుగా సీరియ‌స్‌గా కాకుండా న‌వ్విస్తూనే తాను చెప్పాల‌నుకున్న అంశాన్ని అర్థ‌వంతంగా ఈ సినిమా ద్వారా ప్ర‌జెంట్ చేశారు డైరెక్ట‌ర్‌. ఫ్యామిలీ డ్రామా క‌థ‌లో ఆ మెసేజ్‌ను షుగ‌ర్ కోటెడ్‌లా రాసుకున్న తీరు బాగుంది.
 
వయస్సులో భేధం చూపిస్తూ దర్శకుడు రాసుకున్న కథ బాగుంది. అందుకు ఇద్దరూ బాగా పాత్రలలో మెప్పించారనే చెప్పాలి. చాలా చోట్ల బ్యూటీఫుల్ ఎమోష‌న్స్‌తో సినిమాను న‌డిపించాడు. మొదటి భాగంలో  మూర్తి ప‌డే క‌ష్టాలు, భార్య పోరు ప‌డ‌లేక ఎదుర్కొనే ఇబ్బందుల‌తో స‌ర‌దాగా సాగుతుంది. సెకండాఫ్ మాత్రం మూర్తి ప్ర‌యాణాన్ని హృద్యంగా ఆవిష్క‌రించారు డైరెక్ట‌ర్‌. కథనంలో ఎక్కడా గాడి తప్పకుండా ద్వందార్థాలు లేకుండా క్లీన్‌గా సినిమాను తెరకెక్కించాడు. 
 
ఇది కొందిరు వ్యక్తుల కథ. దానిని ఓన్ చేసుకుని మన కళ్ళముందు చూస్తున్న కొద్దిమంది జీవితాలను అర్థంచేసుకుంటేగానీ కనెక్ట్ కాదు. ఇందులో ఆమ‌ని పాత్ర శుభ‌ల‌గ్నం లాంటి క్యారెక్ట‌ర్‌లో మెప్పించింది. భానుచంద‌ర్‌తో పాటు మిగిలిన వారంతా త‌మ అనుభ‌వంతో మెప్పించారు,
 
ఈ చిత్రం సరదాగా నవ్వించే ప్రయత్నంతో దర్శక నిర్మాతలు చేశారు. సినిమాటోగ్రఫీ, సంగీతం బాగున్నాయి. నిర్మాణ విలువలు కరెక్ట్ గా వున్నాయి. హీరోయిన్ చెప్పే డైలాగ్ లు కొన్ని ఆలోచింపజేసేలా వున్నాయి.  మన తెలుగు కథ కాబట్టి కనెక్ట్ అయ్యేవారికి నచ్చుతుందని చెప్పవచ్చు.
రేటింగ్ : 3/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగుళూరు రేవ్ పార్టీ కేసు : నటి హేమకు తాత్కాలిక ఊరట!!