Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రణీత బాటలోనే యమీ గౌతమ్ పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (21:40 IST)
Yami Gautam
బాపు బొమ్మ ప్రణీత బాటలోనే మరో హీరోయిన్ రహస్యంగా పెళ్లిచేసుకుంది. హీరోయిన్‌ యామీ గౌతమ్‌ పెళ్లి పీటలెక్కింది. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఆదిత్యతో మూడు ముళ్లు వేయించుకుని, ఏడడుగులు నడిచింది. కోవిడ్‌ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితుల సమక్షంలోనే నేడు(శుక్రవారం) వీరి పెళ్లి జరిగింది.  
 
ఈ విషయాన్ని యామీ గౌతమ్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు వెల్లడించింది. వైవాహిక బంధంలోకి అడుగు పెట్టామంటూ భర్తతో కలిసి దిగిన ఫొటోలు షేర్‌ చేసింది. అయితే, పెళ్లికొడుకు ఆదిత్య మరెవరో కాదు, 'ఉరి: ద సర్జికల్‌ స్ట్రైక్‌' డైరెక్టర్‌.. ప్రస్తుతం ఇతడు విక్కీ కౌశల్‌ హీరోగా 'ద ఇమ్మోర్టల్‌ అశ్వత్థామ' సినిమా తీస్తున్నాడు. 
 
ఇక యామీ గౌతమ్‌ విషయానికొస్తే.. 'ఫెయిర్‌ అండ్‌ లవ్లీ' యాడ్‌తో ప్రేక్షకులకు పరిచయమవగా 'ఉల్లాస ఉత్సాహ' అనే కన్నడ చిత్రంతో సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టింది. విక్కీ డోనర్‌'తో బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ హీరోయిన్‌ మొదటి చిత్రానికే ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును సంపాదించుకుంది. తెలుగులో నువ్విలా, గౌరవం, యుద్ధం చిత్రాల్లో కనిపించిన ఆమె చివరిసారిగా నితిన్‌ సరసన 'కొరియర్‌ బాయ్‌ కల్యాణ్‌'లో నటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments