మన శంకరప్రసాద్‌గారిని కలిసేందుకు సైకిల్‌పై వచ్చిన మహిళా వీరాభిమాని (వీడియో)

ఠాగూర్
శుక్రవారం, 29 ఆగస్టు 2025 (15:54 IST)
మెగాస్టార్ చిరంజీవిని కలిసేందుకు ఓ మహిళా వీరాభిమాని సైకిల్‌పై వచ్చి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అదీ కూడా ఏకంగా సైకిల్‌పై హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఆమెను చిరంజీవి ఆప్యాయంగా పలుకరించారు.
 
కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన రాజేశ్వరి చిరంజీవిని చూసేందుకు హైదరాబాద్‌కు సైకిల్‌పై వచ్చారు. 300 కిలోమీటర్లకు పైగా సైకిల్‌ తొక్కుతూ వచ్చి ఆయన్ను కలిశారు. మెగాస్టార్‌కి రాఖీ కట్టి మురిసిపోయారు. చిరు ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆర్థికసాయం చేసి చీరను బహుకరించారు. 
 
ఆమె పిల్లల చదువుకు సంబంధించి పూర్తి బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. వాళ్లు ఎంత వరకూ చదువుకుంటే అంత వరకూ చదివిస్తానని భరోసానిచ్చారు. ఇది చూసిన వారంతా దటీజ్‌ మెగాస్టార్‌ అని కామెంట్స్‌ చేస్తున్నారు. అభిమానానికి హద్దులుండవని మరోసారి నిరూపించారంటూ ఈ వీడియోను షేర్‌ చేస్తున్నారు. 
 
ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’, ‘మన శంకరవరప్రసాద్‌గారు’తో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ ఫిల్మ్‌గా ముస్తాబవుతోన్న ‘విశ్వంభర’ వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తోన్న ‘మన శంకరవరప్రసాద్‌గారు’ 2026 సంక్రాంతికి సందడి చేయనుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Karnataka: 13 ఏళ్ల బాలికను చెరకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

జనాభా పెంచేందుకు చైనా వింత చర్య : కండోమ్స్‌లపై 13 శాతం వ్యాట్

అపుడు నన్ను ఓడించారు... ఇపుడు నా భార్యను గెలిపించండి...

భాగ్యనగరిలో వీధి కుక్కల బీభత్సం - ఎనిమిదేళ్ళ బాలుడిపై దాడి

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments