Director Srikanth Odela with Chiranjeevi at his house
నేచురల్ స్టార్ నానితో దసరా సినిమాకు దర్శకత్వం వహించిన శ్రీకాంత్ ఓదెల నేడు మెగాస్టార్ చిరంజీవితో కలిసిన సెల్ఫీని పోస్ట్ చేశారు. మెగాస్టార్ ఇంటిలో ఆయన్ను కలవడం అద్రుష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన సినిమా చూడ్డం కోసం థియేటర్లలో బుకింగ్ లో తోసుకుంటూ చూసిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు. అటువంటి వ్యక్తి నా డెమీ గాడ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కనుక జీవితంలో గుర్తిండిపోయే సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
చిరంజీవి తో ఒక ఫోటో దిగి ఇంట్లో అమ్మకు చూపిస్తే - ఫస్ట్ టైమ్ నువ్ ఫోటోలో నవ్వడం చూస్తున్నా రా అని చెప్పింది. అది చిరంజీవికి నా నిర్వచనం. ఏం చేస్తాడు చిరంజీవి అంటే: నా లాంటి అంతర్ముఖుడు తో ఇంద్ర తో అడుగు వేయగలిగాను. ఆ సినిమాను ఎన్నిసార్లు చూశానో నాకె తెలీదు. సినిమా టిక్కెట్లు కొన్నుకునేవాడితో సినిమా తీయగలగడం కలగా వుంది. జీవితం అంటే ఇదేనేమో. ఇప్పుడు చిరంజీవి తో సినిమా అంటే! జీవితకాలం గుర్తుండిపోయేలా తీయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు.
నా కోసం నేనే తీస్తున్న సినిమా ఇది. నా లాంటి ప్రతి చిరంజీవి అభిమాని కోసం చూస్తున్న సినిమా. ఇది బ్లడ్ ప్రామిస్. పుట్టినరోజు శుభాకాంక్షలు “టి-రెక్స్” మెగాస్టార్ చిరంజీవి సర్.. అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. కాగా, అక్టోబర్ లో బాబీ సినిమా సెట్ పైకి వెళ్ళనుంది. ఆ తర్వాత శ్రీకాంత్ సినిమాకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది.