థియేట‌ర్లపై చిరంజీవి, నాగార్జున చ‌ర్చ‌లు ఫ‌లిస్తాయా!

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (20:01 IST)
Chiru-kcr-nag
క‌రోనా మొద‌టి వేవ్ త‌ర్వాత షూటింగ్‌లు ప్రారంభ‌మ‌య్యాయి. కానీ థియేట‌ర్ల ఓపెన్ కాస్త ఆల‌స్య‌మైంది. అప్పుడు థియేట‌ర్ల విష‌యంలో తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ సినీ ప్ర‌ముఖులైన చిరంజీవి, నాగార్జున‌, డి.సురేష్‌బాబు, సి.క‌ళ్యాణ్ వంటివారితో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇప్పుడు క‌రోనా సెకండ్ త‌ర్వాత లాక్‌డౌన్ పూర్త‌యిన త‌ర్వాత నిదానంగా షూటింగ్‌లు ప్రారంభ‌మ‌వుతున్నాయి. కానీ థియేట‌ర్లు ఎప్పుడు అనే విష‌యంలో గంద‌ర‌గోళం నెల‌కొంది. దీనిపై ఇటీవ‌లే ఎగ్జిబిట‌ర్లు, పంపిణీదారులు స‌మావేశం అయ్యారు. అదేరీతిలో విజ‌య‌వాడ‌లో కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన వారు కూడా స‌మావేశ‌మ‌య్యారు. అక్క‌డ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను ఒప్పించాలి. ప్ర‌స్తుతం ఆ దిశ‌గా పెద్ద‌లు ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నారు.
 
ఇదిలా వుండ‌గా, తెలంగాణ‌లో ఇప్ప‌ట్లో థియేట‌ర్ల ఓపెన్ చేయాలంటే ప్ర‌స్తుతం నెల‌కొన్న రాత్రి క‌ర్యూ తొల‌గించాకే సాధ్య‌మ‌ని ప్ర‌ముఖ నిర్మాత ఏషియ‌న్ సునీల్ నారంగ్ స్ప‌ష్టం చేశారు. ఆయ‌న నిర్మించిన శేఖ‌ర్ క‌మ్ముల సినిమా ల‌వ్‌స్టోరీ అప్పుడే థియేట‌ర్లో విడుద‌ల చేస్తామ‌న్నారు. ఇదే అభిప్రాయాన్ని ఇటీవ‌ల జ‌రిగిన ఎగ్జిబిట‌ర్ల మీటింగ్‌లో అంద‌రూ మాట్లాడారు. అయితే ఇక్క‌డో స‌మ‌స్య‌కూడా వారు వెలిబుచ్చారు. చిర‌కాలంగా త‌మ స‌మ‌స్య‌లు అలానే వున్నాయ‌ని వాటిని ప‌రిష్క‌రించాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. ఈ మేరకు హీరోలు చిరు, నాగ్ లతో పాటు మంత్రి తలసానిని కలిసి, వారి ద్వారా సిఎమ్ కు సమస్యలను నివేదించాలని, థియేటర్లు తెరచుకునేలోగానే వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. అందులో టికెట్ రేట్లు, ఎంట‌ర్‌టైన్‌మెంట్ టాక్సీ, పార్కింగ్ ఫీజు, కేంటిన్ వంటి స‌మ‌స్య‌లు వున్నాయి. వాటి గురించి ప్ర‌భుత్వం ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Naga Babu vs Balakrishna: నాగబాబు - బాలయ్యతో ఏపీ సీఎం చంద్రబాబుకు తలనొప్పి?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త- రాష్ట్రంలో కొత్త హై స్పీడ్ రైలు కారిడార్లు

ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీ పెడతా.. కల్వకుంట్ల కవిత (video)

Friendship: స్నేహం అత్యాచారం చేసేందుకు లైసెన్స్ కాదు.. ఢిల్లీ హైకోర్టు

40 రోజుల్లో నమాజ్ నేర్చుకోవాలి.. మతం మారిన తర్వాతే వివాహం.. ప్రియురాలికి ప్రియుడు షరతు.. తర్వాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments