Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్‌.ఆర్‌.ఆర్‌. చిత్రీక‌ర‌ణ‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత‌!

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (19:38 IST)
Alia Bhatt
లాక్‌డౌన్ పూర్త‌యింది ఇక షూటింగ్‌కు షురూ అయ్యాయి. ఒక్కో సినిమా ఒక్కో త‌ర‌హాలో ఆర్టిస్టుల డేట్స్ చూసుకుని మొద‌లు పెడుతున్నారు. అలాగే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఆర్‌.ఆర్‌.ఆర్‌. కూడా వ‌చ్చే నెల‌లో మొద‌లు కానుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే దాదాపు షూట్ పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. దీనిపై చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో ఇంకా కేవలం రెండు పాటలు, కొంత పేచ్ వ‌ర్క్‌ తాలూకా షూట్ మాత్రమే బ్యాలన్స్ ఉందని అవి పూర్తయితే ఈ షూట్ పూర్తవుతుందని ఓ మీడియ‌తో తెలిపిన‌ట్లు తెలుస్తోంది. సో ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి. అలాగే ఈ భారీ చిత్రం షూట్ కూడా ఈ జూన్ నెలాఖరు నుంచే స్టార్ట్ చేస్తున్నట్టుగా మరో క్లారిటీ కూడా ఇచ్చారు.
 
ఎందుకంటే, ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పై కొన్ని స‌న్నివేశాలు చిత్రీక‌రించాలి. దానితోపాటు పాట కూడా వుందంట‌. ఆమె ప్రస్తుతం బాలీవుడ్ లో చేస్తున్న `గంగూభాయ్ ఖతియవాది” ముగింపు ద‌శ‌లో వుంది. కేవలం రెండు రోజులు పాల్గొనాల్సి ఉండగా అది కాస్త ఈ నెలలోనే పూర్తి చేయ‌నుంది. ఆ త‌ర్వాత ఆర్‌.ఆర్‌.ఆర్‌.కు డేట్స్ ఇచ్చిన‌ట్లు జూలై మొదటి వారం నుంచి పాల్గొననున్న‌ద‌ని స‌మాచారం. రామ్‌ చరణ్ చేస్తున్న అల్లూరి పాత్ర సరసన సీతగా నటిస్తుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం: ISACA Hyderabad Chapter నిర్వహించిన SheLeadsTech ఈవెంట్

మహిళా కానిస్టేబుల్‍‌కు సీమంతం చేసిన హోం మంత్రి అనిత (Video)

ఖైరతాబాద్‌లో బంగ్లాదేశ్ అమ్మాయిలతో వ్యభిచారం.. ఎన్ఐఏ దర్యాప్తు

రైల్వే క్రాసింగ్ దాటేందుకు బైక్ ఎత్తిన బాహుబలి - వీడియో వైరల్

పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది : అమెరికా హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

తర్వాతి కథనం
Show comments