Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైల్డ్‌డాగ్ ఏప్రిల్‌ఫూల్ చేసింది.

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (20:51 IST)
Wild dog
ఏప్రిల్ ఫ‌స్ట్ అన‌గానే. ఏప్రిల్ ఫూల్ చేసేరోజు. దీనిపై గ‌తంలో ర‌క‌ర‌కాలుగా దిన‌ప‌త్రిక‌ల‌లో ప్ర‌భుత్వ‌ప‌రంగా వార్త‌లు రాసి మొద‌టి పేజీలో అచ్చువేసేవారు. ఆస‌క్తిగా పాఠ‌కులు చ‌దివేందుకు పూర్తి వార్త ప‌లానా పేజీలో వుంద‌ని రాయ‌గానే అక్క‌డికి వెళ్ళ‌గానే.. మ‌రో చోట అని రాసేశారు. ఫైన‌ల్‌గా.. ఇది ఫూల్ చేయ‌డానికి అని తెలిపేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. పేప‌ర్ల‌లో చ‌దివే ఓపిక లేక‌పోవ‌డంతో నాగార్జున వినూత్నంగా ఓ ఐడియాతో త‌న సినిమా ప్ర‌మోష‌న్‌ను చేసుకున్నాడు.

ఈరోజే ఓ వీడియోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. మేట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ అందులో క‌నిపిస్తుంది. ఆ త‌ర్వాత న‌టీన‌టులు అలీ, సైయామి ఖేర్ క‌నిపిస్తారు. పైర‌సీని అరిక‌ట్టండి, థియేట‌ర్ల‌లోనే చూడండి అని చెబుతారు. ఆ వెంట‌నే `హ్యాపీ ఏప్రిల్ ఫూల్ డే`అంటూ టైటిల్ ప‌డుతుంది. సో.. నాగార్జున క్రియేష‌న్ అద‌న్న‌మాట‌. మ‌రి రేపు థియేట‌ర్ల‌లో జ‌నాలు ఎటువంటి తీర్పు ఇస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments