హైదరాబాద్‌లో పుట్టి బాలీవుడ్‌లో రాణిస్తున్న హీరోయిన్ దియా మిర్జా. బీటౌన్‌లో వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా అక్కినేని నాగార్జున సరసన "వైల్డ్ డాగ్" సినిమాలో నటించింది. ఈ మూవీ ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ శ్రీకారం చుట్టుంది.
ఈ సందర్భంగా దియా మిర్జా మాట్లాడుతూ, తనకు యుక్త వయసులోనే తెలుగులో ఆఫర్స్ వచ్చాయి. కానీ.. ఆ సమయంలో నా నటనపై నాకే అనుమానం వచ్చింది. దీంతో సినిమాలకు నో చెప్పేదాన్ని. కానీ ఇన్నేళ్ళకు తెలుగులో నటించే అవకాశం వచ్చింది.
ఈ సినిమా తర్వాత తెలుగులో నాకు మరిన్ని అవకాశాలు వస్తాయని నమ్ముతున్నాను. నాకు ఇష్టమైన నటులు నాగార్జున, వెంకటేష్‌లతో నటించడం ఆనందంగా ఉంది. ఇప్పటికి నా కల సగం నెరవేరినట్టుగా ఉంది. కానీ మరో సగం కల నెరవేరాల్సి ఉంది అంటూ చెప్పుకోచ్చింది. దేశం కోసం పోరాడే వారికి సంబంధించిన స్టోరీనే ఈ వైల్డ్ డాగ్. వారి కుటుంబ జీవితం గురించి ఈ మూవీ సాగుతుంది అంటూ తెలిపింది.
ప్రస్తుతం కాలంలో ఓటీటీ ఫ్లాట్ ఫాంలు ప్రజలు ఆదరిస్తున్నారు. సిని పరిశ్రమ అభివృద్దికి ఈ ఓటీటీలు మరింత తోడ్పాటు అందిస్తాయి. ఇప్పటివరకు మనకు చాలా మంది నటీనటులు, డైరెక్టర్స్, రచయితలు ఉన్నారు. ఇలాంటి వారికి ఈ ఓటీటీలు చాలా ఉపయోగపడుతున్నాయి.
ఇక మార్గదర్శకాలనేవి.. కేవలం ఓటీటీ సంస్థలకే కాకుండా.. సినిమాలకు కూడా ఉండాలి. అంతేకానీ సెన్సార్ ఉండాల్సిన అవసరం లేదు. సరైన ఆలోచనలు ఉన్న ప్రేక్షకులుగా సినిమాలను చూడాలి కానీ.. మరొకరి అభిప్రాయాలతో కాదు. నేను సినీ పిరిశ్రమలోనే పెరిగాను. నాకు మనుషులతోపాటు ప్రపంచాన్ని కూడా అర్థమయ్యేలా ఈ పరిశ్రమ చేసింది.
కేవలం నటిగానే కాకుండా.. నా వ్యక్తిగతంగా నేను చేసిన పనుల వల్ల నేవు ఆనందంగా ఉంటాను. నిర్మాణ రంగంలో మరింత గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది.. ఇప్పటికే నేను నిర్మాతగా ఓ వెబ్ సిరీస్ చేసినట్టు వివరించింది.