Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్ ట్రెండింగ్‌లో #RRR.. సూర్యుడు మంట మీదున్నాడు.. జాగ్రత్త!!

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (20:11 IST)
RRR
జక్కన్న ట్రిపుల్ ఆర్ నుంచి ప్రస్తుతం ఓ అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా గురించిన లేటెస్ట్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ కసితో వున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ వచ్చిన అప్‌డేట్‌పై మాత్రం అదే ఫ్యాన్స్ బీభత్సమైన ట్రోల్స్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ హీట్ పెరిగిపోవడంతో ప్రజలకు కీలక సూచనలు చేస్తూ ట్విట్టర్ వేదికగా ట్రిపుల్ ఆర్ అడ్మిన్ ఓ పోస్ట్ చేశారు. "వడగాడ్పుల అలర్ట్' అంటూ పోస్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్... ''సూర్యుడు మంట మీదున్నాడు.. జాగ్రత్త ఉండండి. నీరు ఎక్కువగా తాగండి.. ఎప్పుడూ చల్లగా ఉండండి'' అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది.
 
నిజానికి ట్రిపుల్ ఆర్ మూవీలో రామ్ చరణ్‌ను అల్లూరిగా పరిచయం చేసిన రాజమౌళి.. నిప్పుగా చూపించాడు. తారక్‌ను కొమరం భీంగా ప్రెజెంట్ చేసి.. నీరుగా అందరికీ పరిచయం చేశాడు. ఈ రెండు పాత్రలనూ ముడిపెట్టి ట్రిపుల్ ఆర్ అడ్మిన్ ట్వీట్ చేశారు. ఇంకేముందీ ట్రిపుల్ ఆర్ ట్విట్టర్ అకౌంట్ నుంచి నోటిఫికేషన్ రాగానే ఫ్యాన్స్ అప్‌డేట్ అనుకుని ట్విట్టర్‌పై దాడి చేశారు. తీరా సమ్మర్ ప్రికాషన్స్ కనపడే సరికి ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఇంకేముంది ట్రిపుల్ ఆర్ ట్విట్టర్ అకౌంట్‌ను ట్యాగ్ చేస్తూ సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు.
 
కొంత మంది మీమ్స్‌తో నవ్విస్తే.. మరికొందరు కామెంట్లతో రచ్చ రచ్చ చేస్తున్నారు. 'వీటికి మాత్రం తక్కువేం లేదు' అంటూ సెటైర్లు వదులడమే కాదు.. 'హ్యాపీ ఫూల్స్ డే బ్రో' అంటూ రిప్లైలు ఇస్తున్నారు. అప్ డేట్స్ ఏమైనా ఉన్నాయా.. ఇవేనా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎండాకాలం షూటింగ్ ఆపాలని, పోస్ట్ పోన్ చేయాలని ఏమైనా ఆలోచిస్తున్నారా ఏంటి? అంటూ జోకులు పేలుస్తున్నారు. దీంతో #RRR ట్విట్టర్ ఖాతా ట్రెండింగ్‌లోకి వెళ్లింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ. 287 కోట్ల లాటరీ, డబ్బు అందుకునేలోపుగా అతడిని వెంటాడిన మృత్యువు

జల్ జీవన్ మిషన్ కింద రూ.4,000 కోట్లు దుర్వినియోగం.. పవన్ కళ్యాణ్

జమిలి బిల్లు: భారత రాజ్యాంగాన్ని బలహీనపరుస్తోంది.. వైఎస్ షర్మిల

ఆస్తి కోసం అన్నదమ్ములను చంపేసిన చెల్లి!!

జేపీసీకి జమిలి బిల్లు... కమిటీలో ప్రియాంకా గాంధీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

తర్వాతి కథనం
Show comments