Webdunia - Bharat's app for daily news and videos

Install App

శేఖ‌ర్ క‌మ్ముల‌ను మ‌హేష్‌, రామ్‌చ‌ర‌ణ్ ఎందుకు రిజ‌క్ట్ చేశారు!

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (19:11 IST)
Mahesh, Ramcharn, Sekar
హీరోను బ‌ట్టి క‌థ కాకుండా క‌థ‌ను బ‌ట్టే హీరో గురించి ఆలోచిస్తానంటాడు ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌. డాల‌ర్ డ్రీమ్  త‌ర్వాత ఆనంద్ సినిమా చేశాక ఆయ‌న గురించి ఎవ్వ‌రికీ తెలీయ‌లేదు. ఆ సినిమాను మెగాస్టార్ చిరంజీవి శంక‌ర్‌దాదా ఎం.బి.బి.ఎస్‌. పోటీగానే విడుద‌ల చేశారు. ఆసినిమా యూత్‌కు బాగా న‌చ్చింది. ఆ సినిమా త‌ర్వాత మ‌రిన్ని సినిమాలు చేయ‌డానికి ఉత్సాహ‌న్నిచ్చింద‌ని తెలియ‌జేశారు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఇటీవ‌లే ఓ ఇంటర్వ్యూలో ఆయ‌న ఫిదా సినిమా గురించి కూడా పేర్కొన్నాడు.
 
ఫిదా సినిమాను మొద‌ట మ‌హేస్‌బాబు, రామ్ చ‌ర‌ణ్ తో చేయాల‌నుకున్నారు. ఇద్ద‌రూ అందుకు ముందుకు రాలేదు. ఆ స‌మ‌యంలో మెగాఫ్యామిలీ నుంచి వ‌రుణ్ తేజ్ సెట్ అయ్యాడు. ఎందుక‌ని మహేష్‌తో చేయ‌లేక‌పోయార‌నేందుకు ఆయ‌న వివ‌రిస్తూ, క‌థ‌లో కొన్ని మార్పులు చేర్పులు సెట్‌కాలేదంటూ సున్నితంగా చెప్పాడు. నేను ఒక‌సారి క‌థ రాసుకున్నాక దానిని ఏవిధంగా మార్చ‌న‌ని శేఖ‌ర్ క‌మ్మ‌ల తేల్చి చెప్పారు. ఫిదా సినిమా లేడీ ఓరియెంటెడ్ మూవీ. అన్నీ సెట్ అయితే మ‌హేష్‌కు మ‌రింత గొప్ప సినిమా అయ్యేద‌ని వెల్ల‌డించారు. అయితే రామ్‌చ‌ర‌ణ్ ఎందుకు వ‌ద్ద‌న్నాడ‌నే విష‌యం గురించి మాత్రం ఆయ‌న వివ‌రించ‌లేదు. కార‌ణం యాంక‌ర్ ఆ ప్ర‌శ్న‌కు అడ‌గ‌లేదు కాబ‌ట్టి.
 
ఎందుకు రిజ‌క్ట్ చేశార‌నే దానికి శేఖ‌ర్ క‌మ్ముల క్లారిటీ ఇస్తూ, నేను క‌థ రాస్తాను. పాత్ర‌లు ఇలా వుండాల‌ని ఊహించుకున్నా. కానీ నెరేష‌న్ లో కొంచెం వీక్‌. నేను క‌థ చెబితే హీరోలకు ఆవులింతలు వస్తాయి. కాబట్టి నన్ను నమ్మి ఒప్పుకోవాలి. మిగతా పార్ట్ అంతా నేను చూసుకుంటాను అని తేల్చిచెబుతున్నాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. తాజాగా ఆయ‌న నాగ‌చైత‌న్య‌తో చేసిన ల‌వ్‌స్టోరీ కూడా అద్భుత‌మైన సినిమా అంటున్నాడు. కాక‌పోతే అది క‌రోనా వ‌ల్ల వాయిదా ప‌డింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తనపై అఘాయిత్యం చేస్తున్న ఉపాధ్యాయుడిని Live video తీసిన విద్యార్థిని

గత 30 ఏళ్లలో తొలిసారిగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం

యూపీలో ఘోరం- రక్షాబంధన్ రోజే 14 ఏళ్ల చెల్లిపై అత్యాచారం.. ఆపై హత్య

Tirupati: శ్రీవారికి వైజయంతి రాళ్లతో పొదిగిన బంగారు లక్ష్మీ లాకెట్టు

గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో భారీ వర్షం- 52 మి.మీ.వరకు వర్షపాతం నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments