Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఏవో ఏవో కలలే` అంటూ వాన‌పాట‌లో `ల‌వ్‌స్టోరీ`జంట

Advertiesment
'ఏవో ఏవో కలలే` అంటూ వాన‌పాట‌లో `ల‌వ్‌స్టోరీ`జంట
, బుధవారం, 24 మార్చి 2021 (11:56 IST)
Love story song
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా `లవ్ స్టోరి` సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించారు. ఇటీవ‌ల ''లవ్ స్టోరి'' నుంచి రిలీజ్ చేసిన ప్రతి పాట హిట్ కొడుతూ సినిమాపై అటు వ్యాపార వర్గాల్లో ఇటు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతోంది. ఈ చిత్రంలోని మరో పాట విడుదలకు సిద్ధమవుతోంది. ''లవ్ స్టోరి'' సినిమాలోని 'ఏవో ఏవో కలలే' పాటను గురువారం ఉదయం 10.08 నిమిషాలకు సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేయబోతున్నారు. 
ఈ సాంగ్ పోస్టర్ చూస్తే ..పాటలో అదిరిపోయే స్టెప్పులు ఉంటాయని తెలుస్తోంది. వాన పాట కాబట్టి నాగ చైతన్య, సాయి పల్లవి జంటలో మరింత జోష్ ఖాయం. 'సారంగ దరియా' లో సాయి పల్లవి సోలో స్టెప్స్ చూసిన ఆడియెన్స్ ఈ రెయిన్ డ్యూయెట్ లో చైతూ, సాయి పల్లవి డాన్సులు ఎంజాయ్ చేయబోతున్నారు. ఏప్రిల్ 16న ''లవ్ స్టోరి'' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ''లవ్ స్టోరి'' చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటించారు.
 
సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, ఎడిటర్ : మార్తాండ్ కె.వెంకటేష్, మ్యూజిక్ : పవన్ సి.హెచ్, సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి, పిఆర్ఓ : జి.ఎస్.కె. మీడియా , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర రావు, నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు, రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

`శుక్ర`లోని 'ఛోరా చకోర' పాటకు ఆద‌ర‌ణ‌