Webdunia - Bharat's app for daily news and videos

Install App

న‌మ్ర‌త చేసిన మేలు వ‌ల్ల లాభ ప‌డింది ఎవ‌రు?

Webdunia
శనివారం, 1 మే 2021 (15:56 IST)
Namrta, Mahesh
ప్రతి పురుషుడి విజ‌యం వెనుక, ఒక స్త్రీ ఉంటుంది. అది సామెత‌. దానికి త‌గిన‌ట్లే మ‌హేష్‌బాబు వెనుక న‌మ్ర‌త వుంది. ఆమె ఎప్పుడూ మ‌హేష్‌బాబు కెరీర్ గురించే ఆలోచిస్తుంది. ఇంత‌కుముందు వేరే వారు చూసుకునేవారు. పిల్ల‌లు కాస్త పెద్ద‌వారు అయ్యాక పూర్తిగా మ‌హేష్‌ను ఆమె గైడ్‌లాగా చూసుకుంటుంది. ఆమ‌ధ్య త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో మ‌హేష్‌బాబు సినిమా వుంద‌ని హారీక హాసిని సంస్థ ప్ర‌క‌టించింది. ఇందుకుగాను భారీ మొత్తం అడ్వాన్స్ కూడా ఇచ్చింది. కానీ కొన్ని కార‌ణాల‌వ‌ల్ల అది సాధ్య‌ప‌డ‌లేదు. ఈలోగా స‌ర్కారువారి పాట సినిమాలో మ‌హేష్ వుండ‌డం. క‌రోనా రావ‌డం దాంతో అనుకోని బ్రేక్ ప‌డింది.
 
ఇక హారిక హాసిని సంస్థ ఇచ్చిన అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేయ‌డానికి న‌మ్ర‌త చాలా హుందాగా వ్య‌వ‌హ‌రించింది. ఎవ్వ‌రికీ ఇబ్బంది రాకుండా ఆమె తీసుకున్న కేర్ గురించి గొప్ప‌గా చెబుతున్నారు ఫిలింన‌గ‌ర్ జ‌నం. ఇక ఈ గేప్‌లో ఏదైనా వ్యాపార ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తే వాటిని త్రివిక్ర‌మ్‌చేత చేయించాల‌ని ఆమె ప్లాన్ వేసింది. ఎందుకంటే ప్రాజెక్ట్ త‌ప్పిపోయినా మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ బాగుండాల‌ని న‌మ్ర‌త ఆలోచ‌న‌. 
 
అస‌లు త్ర‌విక్ర‌మ్‌తో మ‌హేష్ సినిమా చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ది న‌మ్ర‌త‌నే. క‌రోనాకుముందు అల వైకుంఠ‌పురంలో, స‌రిలేరు నీకెవ్వ‌రూ సినిమాలు విడుద‌ల‌య్యాయి. స‌రిలేరు.. సినిమా బాగుంది. మంచి సందేశం ఇమిడి వుంది. బాగానే ఆడింది. కానీ అల వైకుంఠ‌.. సినిమాకు వ‌చ్చినంత క్రేజ్ అంతా ఇంతాకాదు. అందులోని పాట‌ల‌కు, ల‌వ్ సీన్స్‌కు, కుటుంబ నేప‌థ్య స‌న్నివేశాల‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. క‌లెక్ష‌న్ల‌ప‌రంగా నెంబ‌ర్‌^1లో నిలిచింది. అందుకే అది గ్ర‌హించిన న‌మ్ర‌త త్రివిక్ర‌మ్‌తో సినిమా చేయాల‌ని నిర్ణ‌యించింద‌ని తెలుస్తోంది. ఇందులో ఓ మ‌త‌ల‌బు కూడా దాగి వుంద‌ని స‌మాచారం. స‌రైన క‌థ‌ను త్రివిక్ర‌మ్‌తో రాయించి ఆ సినిమాను న‌మ్ర‌త స్వంత బేన‌ర్‌లో తీయాల‌నుకుంటున్న‌ద‌ని ఫిలింన‌గ‌ర్ టాక్‌. చూద్దాం. ముందు ముందు ఏం జ‌రుగుతుందో.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments