Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ ఆంటోనీ హత్య నుంచి ఎవరు నువ్వు? సాంగ్

Webdunia
మంగళవారం, 4 జులై 2023 (09:58 IST)
Vijay Antony, Ritika Singh
బిచ్చగాడు-2 మూవీతో రీసెంట్‌ సూపర్ హిట్ అందుకున్న తమిళ హీరో విజయ్ అంటోని.. మరో సినిమాతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. సరికొత్త లైన్‌తో క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌ డ్రాప్‌లో హత్య సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విజయ్ ఆంటోని డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నాడు. హీరోయిన్‌గా రితికా సింగ్ నటిస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ఎవరు నువ్వు..? అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ మేకర్స్ రిలీజ్ చేశారు.
 
ఎవరు నువ్వు..? అంటూ సాగే ఈ పాట.. ప్రేక్షకులను సరికొత్త ట్రాన్స్‌లోకి తీసుకు వెళ్లేలా ఉంది. ఈ పాటను ఎంఎస్ కృష్ణ, అంజనా రాజగోపాలన్ ఆలపించగా.. భవ్యశ్రీ సాహిత్యం అందించారు. గిరీష్ గోపాలకృష్ణన్ అందించిన మ్యూజిక్ వినసొంపుగా ఉంది.  ఈ పాటతో  సినిమాపై మరింత అంచనాలను పెంచేశారు మూవీ మేకర్స్.
 
బాలాజీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హత్య మూవీ జూలై 21న థియేటర్లలోకి రాబోతుంది. కంప్లీట్ మేకోవర్‌తో.. సరికొత్త కొత్త లుక్‌లో స్టైలీష్‌గా విజయ్ ఆంటోని కనిపిస్తున్నాడు. కొత్త కథలు, డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను అలరించేందుకు విజయ్.. మరోసారి అలాంటి స్టోరీనే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. లోటస్ పిక్చర్స్‌తో కలిసి ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ హత్య మూవీని నిర్మిస్తోంది. కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగం పిళ్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్‌విఎస్ అశోక్ కుమార్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments