ప్రేమ అంటే నమ్మకంలేని యువతిని టక్కర్ ఏమిచేసాడు !

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (15:33 IST)
Siddharth, Divyansha Kaushik
'బొమ్మరిల్లు'  హీరో సిద్ధార్థ్ 'టక్కర్' అనే సినిమాతో సరికొత్తగా అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగు లో విడుదల చేస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. 2023, మే 26న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది.
 
టక్కర్ టీజర్ విడుదలైంది. "నేనంటే ఇష్టం లేదా", "లవ్ అంటేనే ఇష్టంలేదు" అంటూ నాయకానాయికల సంభాషణలతో టీజర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. అసలు ప్రేమ అనేదే లేదని నమ్మే యువతికి ఓ యువకుడు దగ్గరవ్వడం, ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రూపొందిన టీజర్ ఆసక్తికరంగా సాగింది. ఇక టీజర్ లో సిద్ధార్థ్ సరికొత్త మేకోవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ప్రేక్షకులను అలరించడం ఖాయమని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.
 
అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నివాస్ కె. ప్రసన్న సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వాంచినాథన్ మురుగేశన్, ఎడిటర్ గా జీఏ గౌతమ్, ఆర్ట్ డైరెక్టర్ గా ఉదయ కుమార్ కె వ్యవహరిస్తునాన్రు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments