Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి నెం.13లో ఏం జ‌రిగింది!

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (12:05 IST)
Shivangi Mehra
‘కాలింగ్‌ బెల్‌’, ‘రాక్షసి’ చిత్రాలు రూపొందించిన ప‌న్నా రాయ‌ల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న మ‌రో డిఫ‌రెంట్ మూవీ ‘ఇంటి నెం.13’ . ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఫ‌స్ట్‌లుక్‌తోనే ప‌న్నా రాయ‌ల్ నుంచి మ‌రో డిఫ‌రెంట్ మూవీ రాబోతోంద‌ని అర్థ‌మైంది. ఈ నేప‌థ్యంలోనే సంక్రాంతి కానుక‌గా ‘ఇంటి నెం.13’  టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. టీజ‌ర్ చూసిన ప్ర‌తి ఒక్క‌రికీ ఈ సినిమా ఓ కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చెయ్య‌బోతోంద‌ని అర్థ‌మ‌వుతుంది. సినిమాటోగ్ర‌ఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆడియ‌న్స్‌ని మెస్మ‌రైజ్ చేసేలా ఉన్నాయి. ఈ టీజ‌ర్ విడుద‌లైన క్ష‌ణం నుంచి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని రీగల్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌ పతాకంపై హేసన్‌ పాషా నిర్మిస్తున్నారు.
 
ద‌ర్శ‌కుడు ప‌న్నా రాయ‌ల్ మాట్లాడుతూ ‘‘ప్రేక్ష‌కుల‌కు ఓ కొత్త అనుభూతిని అందించాల‌న్న ల‌క్ష్యంతో రూపొందించిన సినిమా ఇది. మిస్టీరియ‌స్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ఓ డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియ‌న్స్‌ని ఇస్తుంది. టీజ‌ర్ రిలీజ్ అయిన త‌ర్వాత వ‌స్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా కంటెంట్ ప‌రంగానే కాదు, టెక్నిక‌ల్‌గా కూడా చాలా హై రేంజ్‌లో ఉంటుంది. ఆడియ‌న్స్‌కి ఓ హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ క‌లుగుతుంది.‘‘  అన్నారు.
 
నిర్మాత హేస‌న్ పాషా మాట్లాడుతూ ‘‘ఈరోజు టీజ‌ర్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చాం. మేం ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వ‌స్తోంది. మా బేన‌ర్ నుంచి ఓ డిఫ‌రెంట్ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా ట్రైల‌ర్‌ను కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ట్రైల‌ర్ రిలీజ్‌తో ఈ సినిమాపై ఆడియ‌న్స్ ఎక్స్‌పెక్టేష‌న్స్ మ‌రింత పెరుగుతాయ‌న్న న‌మ్మ‌కం ఉంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి త్వ‌ర‌లోనే ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తాం‘‘ అన్నారు.
 
నవీద్‌బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్‌, నికీషా, ఆనంద్‌రాజ్‌, తనికెళ్ళ భరణి, పృథ్విరాజ్‌, నెల్లూరు సుదర్శన్‌, శివన్నారాయణ, సత్యకృష్ణ, విజయ రంగరాజు, రవివర్మ, దేవియాని, గీతాసింగ్‌, శ్రీ‌ల‌క్ష్మి, గుండు సుద‌ర్శ‌న్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకు సంగీతం: వినోద్‌ యాజమాన్య, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.మణికర్ణన్‌,  ఎడిటింగ్‌: ఎస్‌.కె.చలం, కొరియోగ్ర‌ఫీ: కె.శ్రీ‌నివాస్‌, మాటలు: వెంకట్‌ బాలగోని, పాటలు: రాంబాబు గోశాల, సింగ‌ర్స్ శ్రియా గోష‌ల్‌, రాజ‌ల‌క్ష్మి(త‌మిళ్ సామి సాంగ్ ఫేమ్‌), మాల్గాడి శుభ‌, ఐశ్వ‌ర్య యాజ‌మాన్య‌, నిర్మాత: హేసన్‌ పాషా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పన్నా రాయల్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సైబర్ క్రైమ్: వాట్సాప్ పోస్టులు ఫార్వర్డ్ చేసినా నేరమేనా, ఎలాంటి పోస్టులు నేరమవుతాయి?

అప్రమత్తంగా ఉండండి: సహజ వాయువు పైప్‌లైన్‌ల తవ్వకం, నాశనం చేస్తే చట్టపరమైన చర్యలు

దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు.. ఎందుకంటే.. పవన్‌పై అలా?

కారం, పసుపు ఎక్కువగా తింటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

DCM రక్షణ బిల్లు ఎవరికోసం.. ఆ భాష ఏంటండీ బాబూ.. చదవలేకపోతున్నాను.. శ్యామల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments