Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లో పెళ్లి బాజాలు.. నిక్కీ గల్రానీతో ఆదిపినిశెట్టి పెళ్లి?!

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (16:19 IST)
టాలీవుడ్‌లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. వరుసగా హీరోలు వివాహాలు చేసుకుంటున్నారు. కరోనా కాలం ప్రస్తుతం ఇంటిపట్టునే వుండటంతో వివాహంతో హీరోలు ఓ ఇంటివారు అవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే నిఖిల్, నితిన్ పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇక దగ్గుబాటి వారి వారసుడు భళ్ళాలదేవుడు రానా పెళ్ళికి రెడీ అయ్యాడు. మిహికా బజాజ్ తో త్వరలో పెళ్లి జరగబోతోంది. 
 
తాజాగా మరో హీరో పెళ్లికొడుకు కాబోతున్నాడనే వార్త హల్ చల్ చేస్తోంది. రవిరాజా పినిశెట్టి కుమారుడిగా ఎంట్రీ ఇచ్చి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఆదిపినిశెట్టి. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏదైనా సరే ఆది ఓకే చెప్పేస్తాడు. రంగస్థలం చిత్రంలో అశోక్ బాబుగా ఇండస్ట్రీని ఫిదా చేశాడు. 
 
అంతకు ముందు 'నిన్ను కోరి' సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసి నానితో పాటు క్రేజ్ సంపాదించాడు. ప్రస్తుతం ఇతడి వివాహం నెట్టింట వైరల్ అవుతోంది. ఆది పినిశెట్టి హీరోయిన్ నిక్కీ గల్రానీని వివాహం చేసుకునేందుకు రెడీ అవుతున్నాడని టాక్ వస్తోంది. 
 
ఆది తండ్రి రవిరాజా ఇటీవల నిర్వహించిన బర్త్ డే వేడుకల్లో వారి ఫ్యామిలీ ఫొటోలో నిక్కీ కనిపించింది. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత వీరిద్దరి వివాహం జరుగనుందని సమాచారం. వీరిద్దరూ మలుపు, మరకతమణి చిత్రాల్లో కలిసి నటించారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఆది, నిక్కీ గల్రానీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగుతల్లికి జలహారతి.. రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగితే.. చంద్రబాబు (video)

రాజస్థాన్‌లో అద్భుతం: భూమి నుంచి ఉప్పెనలా నీటి ప్రవాహం (video)

పేర్ని నానిపై కేసు : ఏ క్షణమైనా అరెస్టు... హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

కన్యాకుమారిలో 10 మీటర్ల వెడల్పుతో గాజు వంతెన.. సముద్రంపై నడిచేలా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

తర్వాతి కథనం
Show comments