Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇదే నా చివరి వీడియో.. వేధిస్తున్నారు... విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం

Advertiesment
ఇదే నా చివరి వీడియో.. వేధిస్తున్నారు... విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం
, సోమవారం, 27 జులై 2020 (07:58 IST)
తమిళనటి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సోషల్ మీడియాలో వేధింపులు, బెదిరింపుల కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు అంతకుముందు ఆమె ఓ వీడియోలో పేర్కొన్నారు. నామ్ తమిళర్ పార్టీ నేత సీమన్, పనన్‌కట్టు పడైకి చెందిన హరి నాడార్ ఫాలోవర్లు తనను వేధిస్తున్నట్టు పేర్కొంటూ విజయలక్ష్మి సోషల్ మీడియాలో పలు వీడియోలు విడుదల చేశారు. 
 
సోషల్ మీడియా వేదికగా తనను కొందరు వేధిస్తున్నారని.. ఇంకా ఆమె పోస్టు చేసిన వీడియోలో ఇది తన చివరి వీడియో అన్నారు. సీమన్, అతడి పార్టీ కార్యకర్తల వల్ల గత నాలుగు నెలలుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని చెప్పుకొచ్చారు. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించానని చెప్పారు. 
 
మీడియాలో తనను హరి నాడార్ అవమానించారు. బీపీ మాత్రలు తీసుకున్నా. మరి కాసేపట్లో నా బీపీ పడిపోతుంది. ఆ తర్వాత చనిపోతా అంటూ ఆమె వీడియో రికార్డ్ చేస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు ఆమెను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. ఈమె తమిళంలో ఫ్రెండ్స్ అనే సినిమాలో నటించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన మెగాస్టార్, పవర్ స్టార్