Webdunia - Bharat's app for daily news and videos

Install App

వై.ఎస్‌. జ‌గ‌న్‌ను దాని కోస‌మే క‌లిశాం- రాజ‌మౌళి

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (14:27 IST)
Rajamouli-Jagan
నిన్న సోమ‌వారంనాడు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఎ.పి. ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్‌ను ఎందుకు క‌ల‌వాల్సి వ‌చ్చిందో స్ప‌ష్టం చేశారు. నిన్న వెళ్ళి క‌లిసిన వాట వాస్త‌వ‌మే. అంత‌కుముందు అంద‌రం క‌లిసిన‌ప్పుడు టికెట్ల పెంపు త‌దిత‌ర అంశాల‌పై జి.ఓ. ఇస్తామ‌న్నారు. కానీ దానిపై పూర్తి క్లారిటీ లేదు. అందుకే మా ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా సంద‌ర్భంగా జ‌గ‌న్‌ను గౌర‌వంగా క‌లిశామ‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌కు సినిమాను కొంత‌భాగం చూపించార‌ని తెలిసింది, ఆయ‌న ఏమ‌న్నార‌నే దానికి రాజ‌మౌళి స‌మాధానం దాట‌వేశారు.
 
ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో మీడియాతో రాజ‌మౌళి మాట్లాడుతూ, ఎ.పి. ప్ర‌భుత్వం హామీ ఇచ్చిన‌ట్లు అన్నివిధాలా అనుకూలంగా వుంటుంద‌ని తెలిపారు. ఆయ‌న దీనిపై వివ‌ర‌ణ ఇస్తుండ‌గానే, ఎ.పి. ప్ర‌భుత్వం టికెట్ల ధ‌ర‌ను 100 రూపాయ‌లు పెంచిన‌ట్లు ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. అంత‌కుముందు పెద్దల రిక్వెస్ట్ మేరకు ఏపీలో కొత్త జీవో విడుదలైనప్పటికీ అక్కడ 20 శాతం షూటింగ్ జరుపుకున్న చిత్రాలకు మాత్రమే టికెట్ రేట్లను పెంచుకునే అవకాశాన్ని కన్పించింది ప్రభుత్వం. దీంతో కొత్త జీవోపై “రాధేశ్యామ్” పెట్టుకున్న ఆశలు అడియాశలే అయ్యాయి. 
 
నేడు వెలువ‌డిన ప్ర‌క‌ట‌న వ‌ల్ల  “ఆర్‌ఆర్‌ఆర్‌” టిక్కెట్‌ ధరలను 100 రూపాయల పెంపునకు అనుమంతించింది. ఎ.పి.లో టికెట్ రేట్ల విషయంలో ఈ బెనిఫిట్ అందుకుంటున్న మొదటి తెలుగు సినిమా రాజ‌మౌళిదేకావ‌డం విశేసం. ఇక బెనిఫిట్ షోలకు కూడా ఏపీలో సపోర్ట్ లభించింది. ఎగ్జిబిటర్లు పెద్ద సినిమాలను రోజుకు ఐదు షోలు ప్రదర్శించవచ్చని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. పెద్ద సినిమా, చిన్న సినిమా ఒకేరోజు విడుదలైతే ఎగ్జిబిటర్లు కనీసం రోజుకు ఒక్కసారైనా చిన్న సినిమాలను ప్రదర్శించాలని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments