Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌గ‌ధీర‌కు లీకేజ్ ఎక్క‌డ‌నేది క‌నిపెట్టాం - ఎడిట‌ర్ త‌మ్మిరాజు

Webdunia
మంగళవారం, 3 మే 2022 (15:50 IST)
Editor Tammiraju
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. డబుల్ బ్లాక్‌బస్టర్ 'F2' ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'F3' ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రానికి ఎడిట‌ర్‌గా ప‌నిచేసిన త‌మ్మిరాజు మీడియా స‌మావేశంలో ప‌లు విష‌యాలు తెలియ‌జేశారు. 
 
ఎడిట‌ర్‌గా ఎన్ని సంవ‌త్స‌రాల అనుభ‌వం మీది?
ఇండ‌స్టీకి వ‌చ్చి ఇర‌వై ఏళ్ళు అయింది. 1998లో యావిడ్ ఎడిట‌ర్‌గా రామోజీ ఫిలింసిటీలో ప‌నిచేశాను. ఆ త‌ర్వాత 14 ఏళ్ళ‌పాటు ప్ర‌సాద్‌ల్యాబ్‌లో వ‌ర్క్ చేశాను. ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిగారితో 18 ఏళ్ళ జ‌ర్నీ నాది. ఆయ‌న చేసిన `అగ్నివాసం` సీరియ‌ల్ నుంచి బాహుబ‌లి2 సినిమావ‌ర‌కు ప‌నిచేశాను. ప‌టాస్ నాకు ఎడిట‌ర్‌గా మొద‌టి సినిమా. అప్ప‌టినుంచి అనిల్‌గారితో మంచి సంబంధాలున్నాయి. `మిర్చి` సినిమాకు అసోసియేట్ ఎడిట‌ర్‌గా ప‌నిచేశాను.
ఇప్ప‌టివ‌ర‌కు ఎన్ని సినిమాలు చేశారు? ఎఫ్‌2నుంచి ఎఫ్‌3కి సాంకేతిక మార్పులు ఏమైనా వున్నాయా?
నేను ఇప్ప‌టివ‌ర‌కు 30 సినిమాల‌కు ప‌నిచేశాను. అయితే సాంకేతికంగా ఎడిటింగ్‌లో టెక్నాల‌జీ ఏమీ మార‌దు.చూసే విధానం మారుతుంది. క‌రోనా వ‌ల్ల ప్రేక్ష‌కుల్లో సినిమాను చూసే విధానం మారింది. క‌నుక దానిని బ‌ట్టి ఎడిటింగ్ చేయాల్సి వుంటుంది.
ఎఫ్‌3 ఎలాంటి క‌థ‌?
ఎఫ్‌2లో మ్యారేజ్‌, క‌ష్టాలు అనేవి చూపించారు. ఎఫ్‌3 లో డ‌బ్బు ప్ర‌ధాన‌మైంది. మాన‌వ‌సంబంధాలు దాని చుట్టూనే తిరుగుతుతాయ‌నేది క‌థ‌. ఎప్‌2 ఫ్రాంచైజీ నుంచి వ‌చ్చిన క‌థే ఇది.
కామెడీ సీన్స్‌ ఎడిటింగ్ చేయ‌డం క‌ష్ట‌మేనా?
కామెడీ సినిమాలో పంచ్‌లు చాలా వుంటాయి. వాటిల్లో ఏది ట్రిమ్ చేయాల‌న్నా క‌ష్ట‌మే. అందుకే ఒక‌టికి రెండు సార్లు చూసుకుని ద‌ర్శ‌కుడితో చ‌ర్చించి క‌ట్ చేయాల్సి వ‌స్తుంది.
బ‌డ్జెట్ ఎలా వుంటుంది?
క‌థ‌కు ఏది అవ‌స‌ర‌మో దాని గురించే ఎడిట‌ర్ ఆలోచిస్తాడు. ఎంత ఖ‌ర్చు పెడుతున్నార‌నేది ఎడిట‌ర్ ప‌ని కాదు.
అనిల్ గారితో వ‌ర్క్ చేయ‌డం ఎలా వుంటుంది?
అనిల్‌గారితో వ‌ర్క్ పాజిటివ్‌గా వుంటుంది. ఎడిటింగ్ టేబుల్ ద‌గ్గ‌ర కూడా ఆయ‌న ప్రేక్ష‌కుడిలా ఆలోచిస్తారు. `ప‌టాస్‌` ర‌షెస్ చూశాక సినిమా బాగుంద‌న్నారు. దాన్ని వేరే ఫార్మెట్‌లో ఎడిటింగ్ చేయాల‌నుంద‌ని చెప్పాను. అది అనిల్‌గారికి న‌చ్చింది. త‌న‌కు ఏది కావాలో చెప్పే విధానంలో అవ‌గాహ‌న వుంది. ప్రీ ప్రొడ‌క్ష‌న్‌లో ఎంత ఇదిగా చేస్తారో పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్‌లో కూడా అంతే చేస్తే మంచి ఔట్‌పుట్ వ‌స్తుంది.
- మొద‌టి ప్రేక్ష‌కుడు మీరే క‌దా? ఏవైనా స‌ల‌హాలు ఇస్తుంటారా?
ఒక్కోసారి తీసుకుంటారు.
మొద‌ట మీకు ర‌ఫ్‌గా ఔట్‌పుట్ వ‌స్తుంది. దాన్ని ఎడిటింగ్ చేయాలంటే క‌ష్టం అనిపిస్తుందా?
మ్యూజిక్‌, డ‌బ్బింగ్ లేకుండానే ఎడిటింగ్ రూమ్‌కు వ‌స్తుంది. ద‌ర్శ‌కుడు ఏం చెప్ప‌ద‌ల‌చుకున్నారో సీన్ ను బ‌ట్టి చేసుకుంటాం. ఆ త‌ర్వాత సినిమా మొత్తం చూశాక ఫ్లోలో కొంత ఛేంజ్ అవుతుంది. అప్పుడు కూడా ఎడిటింగ్‌కు ప‌ని వుంటుంది. 
మొద‌టి ఆడియ‌న్‌గా ఎఫ్‌3 ఎలా వుంది మీకు?
ప్రేక్ష‌కుడిగా ఎఫ్‌2 కంటే  ఎఫ్‌3 డ‌బుల్ థ‌మాకా. డ‌బ్బు గురించి కొత్త విష‌యాలు చెప్పారు. డ‌బ్బు గురించి అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌నేదికూడా ట‌చ్ చేశారు. మెసేజ్ కంటే ఫ‌న్ చాలా వుంది. ఫైన‌ల్‌గా డ‌బ్బు అవ‌స‌రం అనే మెసేజ్ అంత‌ర్లీనంగా క‌నిపిస్తుంది.
నిర్మాత ప్ర‌మేయం ఎడిటింగ్‌లో వుంటుందా?
నిర్మాత దిల్‌రాజు షూటింగ్‌లోనే ద‌ర్శ‌కుడితో చ‌ర్చిస్తారు. ఎడిట‌ర్ దాకా రారు. ఈ సినిమా 2.30 నిమిషాల నిడివి వుంటుంది.
పాన్ ఇండియా సినిమా వ‌ల్ల ఎడిట‌ర్‌కు ప‌నిలో స‌వాల్‌గా అనిపిస్తుందా?
ఎడిట‌ర్ కు స‌వాలే. చాలా మంది పాన్ ఇండియా సినిమా అంటే సీనియ‌ర్ ఎడిట‌ర్ కావాలంటారు. నేను ఆల్‌రెడీ బాహుబ‌లి సినిమాకు ప‌నిచేయ‌డంతో ఆ ఇబ్బంది రాలేదు. కొంద‌రు ఆల్ లాంగ్వేజ్ తెలిసిన వారు ఎడిట‌ర్‌గా ఉంటేబాగుంటుంద‌నే అంశాన్ని కూడా చూస్తున్నారు.
 ద‌ర్శ‌కుడికి ఎడిట‌ర్‌కు మ‌ధ్య ఎప్పుడైనా ఇబ్బంది క‌లిగిన‌ సంద‌ర్భాలున్నాయా?
ద‌ర్శ‌కుడికీ మాకూ ఎటువంటి ఇబ్బంది వుండ‌దు. ఎడిట‌ర్‌, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు క‌లిసి ఈ సీన్ ఎందుకు వుండాలి. ఇక్క‌డ ఎందుకు వుండ‌కూడ‌దు అనేది చ‌ర్చిస్తుంటాం.
మీరు క‌థ వింటారా?
నేను క‌థ విన‌ను. ఎడిటింగ్ టేబుల్ ద‌గ్గ‌ర‌కు రాగానే వ‌చ్చిన ఔట్‌పుట్ ను బ‌ట్టి ఏదైనా అనుమానాలు వుంటే చెబుతాం. బాహుబ‌లి కూడా అలా చేశాను.
చాలా సినిమాలు బ్లూ మ్యాట్‌తో చేయ‌డం వ‌ల్ల వ‌ర్క్ ఇబ్బంది అనిపించిందా?
బ్లూ మ్యాట్‌తో చేశాక వ‌చ్చిన ఔట్‌పుట్‌ను అందుకు అనుగుణంగా ఎడిట్ చేయాలి. అంతా వ‌ర్క్ పూర్త‌య్యాక చూస్తే ఒక్కోసారి బ్యాక్‌గ్రౌండ్‌లో తేడా క‌నిపిస్తే చ‌ర్చించుకుని ఎడిట్ చేస్తాం.
ఎఫ్‌3లో హైలైట్ ఏమిటి?
ఎఫ్ 3 సూప‌ర్ హిట్ అందులో అనుమానంలేదు. వెంక‌టేష్ వ‌రుణ్‌తేజ్ న‌ట‌న హైలైట్‌గా వుంటుంది.
ఒక్కోసారి కొన్ని సినిమాల‌కు ఎడిటింగ్ లో త‌ప్పులు క‌నిపిస్తాయి  గ‌దా?
అవును. కొన్నింటికి అలా జ‌రిగి వుండ‌వ‌చ్చు.
సినిమా స‌క్సెస్ అయితే మీ పాత్ర వుంటుందా?
సినిమా స‌క్సెస్ అనేది ద‌ర్శ‌కుడిదే. ఎవ‌రు ఎంత ప‌నిచేసినా ద‌ర్శ‌కుడు చూపించిన ర‌షెస్‌, విజ‌న్ నుంచి వ‌చ్చే ఔట్‌పుట్ వ‌ల్లే సాధ్యం.
ఎడిటింగ్ టెక్నాల‌జీలో ఏమైనా మార్పులు వ‌చ్చాయా?
ఎడిటింగ్‌లో టెక్నాల‌జీ మార్పు అనేది త‌క్క‌వే. ఎడిటింగ్ చేయాలంటే సేమ్ టూల్సే ఉప‌యోగించాలి. ఆన్ లైన్ ఎడిటింగ్‌లో కూడా పెద్ద‌గా మార్పులేదు.
తోటి ఎడిట‌ర్లు అభినందించుకున్న సంద‌ర్బాలుంటాయా?
అలా ఒక‌రినొక‌రు అభినందించుకున్న సంద‌ర్భాలూ వుంటాయి. కొన్ని విష‌యాలు షేర్ చేసుకుంటుంటాం.
ఎడిట‌ర్‌గా మీకు అనుకున్న గుర్తింపు వ‌చ్చిందా?
ఎడిట‌ర్‌గా ప‌నిని బ‌ట్టే గుర్తింపు వ‌స్తుంది. 
లీకేజ్‌లో ఎడిట‌ర్ పాత్ర ఎంత మేర‌కు వుంటుంది?
లీక్ అనేది ఒక‌చోట జ‌ర‌గ‌దు. డ‌బ్బింగ్, ఎడిటింగ్‌తోపాటు  సి.జి. పేరుతో గ్రాఫిక్స్ పేరుతో ప‌లు ర‌కాల కంపెనీల‌కు ఔట్‌పుట్ ఇవ్వ‌డంతో అక్క‌డ వారిలో నిబద్ధ‌త లోపించి లీకేజ్ అయిన సంద‌ర్భాలు వున్నాయి. మ‌గ‌ధీర‌కు అలా ఫేస్ చేశాం. 
కొత్త సినిమాలు?
క‌ళ్యాణ్ రామ్ `బింబిసారా`, మైత్రీమూవీస్ బేన‌ర్‌, క‌ళ్యాణ్‌రామ్ సినిమా,  నాగ‌శౌర్య చిత్రం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం కేసీఆర్

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అనకాపల్లిలో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments