Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరోతో డేటింగ్ చేస్తా.. ఈ హీరోను పెళ్లి చేసుకుంటా.. సైఫ్ అలీఖాన్ డాటర్

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (16:48 IST)
బాలీవుడ్ హీరోయిన్లలో అతి తక్కువ కాలంలో స్టార్‌డమ్ సంపాదించుకున్న యువ హీరోయిన్ సారా అలీఖాన్. ఈమె ప్రముఖ బాలీవుడ్ సీనియర్ స్టార్ సైఫ్ అలీఖాన్. సారాకు తొలి చిత్రం 'కేదార్నాథ్'. ఈ చిత్రం విడుదలకు ముందే ఆమె 'శింబా' చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాల ప్రమోషన్‌లో సారా బిజీబిజీగా గడుపుతోంది. 
 
ఈ నేపథ్యంలో తన డేటింగ్‌, బాయ్‌ఫ్రెండ్, మ్యారేజ్ వంటి విషయాలపై ఈ ముద్దుగుమ్మ ఏమాత్రం తొణకకుండా బెదరకుండా సమాధానాలు చెప్పింది. యువ హీరో కార్తీక్ ఆర్యన్‌తో డేటింగ్ చేస్తానని, కుదిరితే రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లి చేసుకుంటానని ఏమాత్రం సిగ్గుపడకుండా వెల్లడించింది. 
 
ఇదిలావుంటే, ఈ ముద్దుగుమ్మ నటించిన 'కేదార్నాథ్' చిత్రం కేదార్నాథ్ వరద ట్రాజెడీని నేపథ్యంగా చేసుకుని తెరకెక్కించారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అయితే, ఈ చిత్రాన్ని విడుదల చేయరాదంటూ హిందుత్వవాదుల నుంచి పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా డిసెంబరు ఏడో తేదీన ఎట్టిపరిస్థితుల్లోనూ విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. 
 
అలాగే, సారా - రణ్‌బీర్ కపూర్ జంటగా నటించిన చిత్రం శింబా. ఈ చిత్రం టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్‌కు రీమేక్. ఈ చిత్రం డిసెంబరు 7వ తేదీన విడుదలకానుంది. ఇలా మూడు వారాల గ్యాప్‌లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సారా సిద్ధమవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments