Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"ఆ" పని చేస్తూ రణ్‌బీర్ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు.. అందుకే బ్రేకప్

బాలీవుడ్ హీరో, చాక్లెట్ బాయ్ రణ్‌బీర్‌తో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే కొంతకాలం పాటు ప్రేమాయణం సాగించారు. 2007వ సంవత్సరంలో పలు పత్రికలు వీరిద్దరి ప్రేమ గురించి ప్రత్యేక కథనాలే రాసాయి. ఆ తర్వాత అతనికి బ్

Advertiesment
, బుధవారం, 25 జులై 2018 (16:16 IST)
బాలీవుడ్ హీరో, చాక్లెట్ బాయ్ రణ్‌బీర్‌తో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే కొంతకాలం పాటు ప్రేమాయణం సాగించారు. 2007వ సంవత్సరంలో పలు పత్రికలు వీరిద్దరి ప్రేమ గురించి ప్రత్యేక కథనాలే రాసాయి. ఆ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పి ఇపుడు రణ్‌వీర్‌ సింగ్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. అయితే, తన తొలి ప్రేమికుడు రణ్‌బీర్‌తో ఉన్న ప్రేమ బ్రేకప్‌ కావడానికి గల కారణాన్ని దీపికా తాజాగా వెల్లడించింది.
 
తాజాగా ఆమె ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "శృంగారం అనేది నాకు సంబంధించినంతవరకు శారీరకం వరకే కాదు, అందులో ఎమోషన్స్ కూడా ఉంటాయి. నేను ఒకరితో బంధంలో ఉన్నప్పుడు ఎవరిని మోసం చేయలేదు. నమ్మిన వ్యక్తిని మోసం చేస్తే ఆ రిలేషన్ షిప్‌కి విలువేముంది. 
 
అలాంటప్పుడు సింగిల్‌గా ఉండి జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు. రణ్‌బీర్ ఒకసారి నాకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. రెండో అవకాశం ఇవ్వమని ప్రాధేయపడ్డాడు. ఆ ఘటనతో ఓ వ్యక్తిని గుడ్డిగా నమ్మొద్దని తెలిసి రణ్ బీర్‌కి దూరమయ్యాను. మానసికంగా కుంగిపోయిన నేను ఆ విషాదం నుండి బయటపడడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది" అని చెప్పుకొచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్‌ బయోపిక్.. యాత్రలో ''జగన్‌" రోల్‌ ఆ హీరోకు ఇచ్చేశారట..?