Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్గానిక్ కథలు, కంటెంట్ సినిమాలు చేయాలనుకుంటున్నా: శివ కందుకూరి

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (16:40 IST)
Shiva Kandukuri
ఇంజనీరింగ్ పూర్తి చేసి న‌ట‌న‌పై ఆస‌క్తితో సినిమారంగంలోకి అడుగుపెట్టిన శివ కందుకూరి  2020లో `చూసి చూడంగానే` సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టారు. న‌టుడిగా గుర్తింపు పొందిన ఆయ‌న‌కు `గ‌మ‌నం` సినిమా మ‌రింత‌గా పేరు తెచ్చింది. అందులో చారుహాస‌న్‌, శ్రియా శ‌ర‌ణ్ వంటి న‌టీన‌టుల‌నుంచి ఎంతో నేర్చుకున్నాననీ తెలియ‌జేస్తున్నారు. `పెళ్లి చూపులు’ ఫేమ్ రాజ్ కందుకూరి  కుమారుడిగా నేప‌థ్యం వున్నా క‌ష్ట‌ప‌డి తానేంటో నిరూపించుకుకోవాల‌నేదే త‌న కోరిక‌ని తెలియ‌జేస్తున్నాడు. శుక్ర‌వారం ఫిబ్ర‌వ‌రి 18న శివ కందుకూరి పుట్టిన‌రోజు.  ఈ సంద‌ర్భంగా గురువారంనాడు మీడియాలో ప‌లు విష‌యాలను తెలియ‌జేశారు.
 
- సినిమా చేయాలంటే క‌థ‌, కేరెక్ట‌ర్‌లో ప‌ర్‌ప‌స్ వుండేలా చూస్తాను. అలాగే  అలాగే క‌థ‌ల‌ను ఎంపిక చేసుకున్నా. `గ‌మ‌నం` అలా చేసిందే. ఆ సినిమా ఓటీటీలో విడుద‌లై అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ప్రేక్ష‌కులు ఆద‌రించారు. దాన్ని బ‌ట్టి నేను ఎంచుకున్న విధానం క‌రెక్ట్ అనిపించింది.
 
- నేను కమర్షియల్ సబ్జెక్ట్‌లను మాత్రమే ఎంచుకోవాలని కాదు. దాని నుంచి బ‌ట‌య‌కు వ‌చ్చి అర్థ‌వంతమైన సినిమాలే చేయాలన్నది నా నమ్మకం. నేను నా నమ్మకాలకు వ్యతిరేకంగా వెళ్లలేను.
 
- కనీసం నా కెరీర్ తొలిదశలో అయినా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనుకుంటున్నాను. కమర్షియల్ సినిమాలు చేసినా ఆర్గానిక్ సినిమాలే చేస్తాను. 'మను చరిత్ర' ఆర్గానిక్‌గా ఉండబోతోంది. క్యారెక్టర్ జర్నీ, స్టోరీ రియలిస్టిక్ గా ఉంటుంది.
 
- నేను ఏ పాత్ర చేసినా పాత్రకు కనెక్ట్ అవ్వాలి. స్క్రిప్ట్‌లో నాకు నమ్మకం ఉండాలి. అల్లు అర్జున్ గారు పుష్ప‌లోని క్యారెక్టర్‌ని నమ్మారు కాబట్టి 'పుష్ప' మెప్పించింది. ఆ స్థాయి నమ్మకం లేకుంటే ప్రేక్షకులు ఇంతగా ఆదరించి ఉండేవారు కాదు. ఇది అన్ని రకాల సినిమాలకూ వర్తిస్తుంది.
- ఏదో ఫ్యామిలీ బేక్‌గ్రౌండ్ వుంది కదాని ఏది బ‌డితే అది చేయ‌కూడ‌దు. ప్రేక్ష‌కులు మ‌న‌ల్ని నిశితంగా గ‌మ‌నిస్తూనేవుంటారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఓటీటీ వ‌చ్చాక స్పానిష్‌తోపాటు ప‌లు దేశాల సినిమాల‌ను చూసి ఎన‌లైజ్ చేస్తున్నారు. అందుకే న‌టులుగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.
 
- వచ్చే ఐదేళ్లలో నేను కొన్ని సినిమాలు మాత్రమే చేయగలను. వాల్యూమ్ పట్టింపు లేదు. మా నాన్న సినిమా ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా ఉన్నారు. సినిమా చేయాలా వద్దా అనే నిర్ణయం నాపై ఆధారపడి ఉంటుంది. నాన్న‌గారు కేవలం ఏదైనా స‌జెన్స్‌ మాత్రమే ఇస్తాడు. చాలా సార్లు  నా అభిప్రాయాలకే పెద్ద పీట వేస్తారు.
 
- కెరీర్ మొద‌టిలోనే `గ‌మ‌నం` ద్వారా చారు హాసన్ సర్, ఇళ‌య‌రాజా సంగీతం, సినిమాటోగ్రాఫర్ విఎస్ జ్ఞానశేఖర్ వంటి సీనియర్లను గమనించి నేను చాలా నేర్చుకున్నాను. నా రెండో సినిమా ‘గమనం’లో ప్రతిభావంతులైన వారితో కలిసి పని చేశాను. క‌థ విన్న‌ప్పుడే నా గ్రాడ్ ఫాద‌ర్‌తో వున్న ఎటాచ్‌మెంట్‌ చారు హాస‌న్‌తో క‌నెక్ట్ అయింది. న‌ట‌న‌కూ స్కోప్ వున్న చిత్ర‌మ‌ది. డెడికేష‌న్ వారి నుంచి నేర్చుకున్నా.
 
- ప్ర‌స్తుతం ఇండస్ట్రీలో యూత్ హీరోల‌తో భారీ పోటీ ఉంటుంది. అదీ పాజిటివ్ కోణంలోనే వుంది. ప్ర‌తి ఒక్క‌రూ క‌థాపరంగా విభిన్నంగా ఏదైనా చేయాలని కోరుకుంటారు.  
 
- పెద్ద చిత్రాల‌తో పాటుగా తక్కువ బడ్జెట్‌లతో రూపొందించబడిన చిత్రాలకు OTT ఒక ఫ్లాట్‌ఫార‌మ్‌గా మారింది. అందులో  కంటెంట్-ఆధారిత కథనాలను చెప్పడానికి ఎక్కువ అవకాశం ఉంది. కొత్త వారికి ఇది చాలా ఆరోగ్యకరమైన విష‌యం.
 
- కొత్త సినిమాల‌ప‌రంగా చూస్తే, 'మను చరిత్ర' చిత్రీకరణ పూర్తి చేసుకుంది. క్రైమ్ థ్రిల్లర్ కూడా చేస్తున్నాను. నూతన దర్శకుడు పురుషోత్తం రాజ్ దీనికి దర్శకుడు. నేచురల్ స్టార్ నాని గారు నిర్మిస్తున్న 'మీట్ క్యూట్ వెబ్ ఫిలింలో చేస్తున్నాను. మ‌రో వెబ్ సిరీస్ కూడా చ‌ర్చ‌ల్లో వుంది. ఓటీటీ అనేది పేండ‌మిక్ త‌ర్వాత  ప్రేక్ష‌కుల‌కు మంచి వినోద సాధ‌నంగా మారిపోయింది. ఏదైనా థియేట‌ర్‌ను బీట్ చేయ‌లేదు.
 
- నా బ‌ర్ద్ డే రిజ‌ల్యూష‌న్ పెద్ద‌గా లేవు. ఆర్గానిక్ స్టోరీలు చెప్పాల‌నుకుంటున్నాను. క‌రోనా అనే గేప్ కూడా క‌థ‌లు ఎంచుకునేవిధానంలో మార్పును ప్ర‌తి ఆర్టిస్టులో క‌ల‌గ‌జేసిందని చెప్ప‌గ‌ల‌ను. మను చ‌రిత్ర అనే సినిమా రెండు నెల‌లో రిలీజ్ చేయాల‌నుకుంటున్నామ‌ని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అనకాపల్లిలో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని

ఆర్ఆర్ఆర్ కేసు : విజయపాల్‌కు సుప్రీంకోర్టు షాక్...

మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్.. మద్దతు పలికిన అజిత్ పవార్

పుష్ప 2 ను ఆడకుండా చేయాలని చూస్తున్నారు, నేను చూస్తాను: అంబటి రాంబాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments