Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వర్షంలో గంటల త‌ర‌బ‌డి అలా నిల్చుని వున్నారు - హీరో శివ కందుకూరి

Advertiesment
వర్షంలో గంటల త‌ర‌బ‌డి అలా నిల్చుని వున్నారు -  హీరో శివ కందుకూరి
, సోమవారం, 6 డిశెంబరు 2021 (18:09 IST)
Siva- charu hasan
శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించిన సినిమా గమనం. సంజనా రావు అనే దర్శకురాలు. రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా  నిర్మించారు. సినిమాను డిసెంబర్ 10న విడుదల చేయబోతోన్నారు. ఈ సందర్భంగా  హీరో శివ కందుకూరి ప‌లు విష‌యాలు తెలియ‌జేశారు. 
 
- చారు హాసన్ వంటి సీనియర్స్‌తో నటించే అవకాశం రావడం ఎంతో అదృష్ణం. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను.. ఆయన ఏ ఒక్క రోజు కూడా షూటింగ్‌కు ఆలస్యంగా రాలేదు.. వర్షంలో ఓ సీన్ ఉంటుంది. నాతో పాటే ఎన్నో గంటలు ఆయన అలా నిల్చుని ఉన్నారు. నిజంగా ఆయ‌న‌కు హాట్సాఫ్‌. 
 
- ఇళయరాజా గారితో పని చేసే అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అది అసాధ్యమని అనుకున్నాను.. ఇళయరాజా గారితో చేస్తానని నా మైండ్‌లో కూడా లేదు.. ఆయన బీజీఎం వల్ల కొన్సి సీన్స్ మరోస్థాయికి వెళ్లాయి.
 
- గమనం సినిమా నా కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా అవుతుంది. ఈ కథ విన్న వింటనే నచ్చింది.  మను చరిత్ర షూటింగ్‌లో ఉన్నప్పుడు ఈ కథ విన్నాను.
 
- ఇండియాలో ఉన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని. కానీ యూఎస్‌కి వెళ్లి చదువుకున్నప్పుడు ప్రాక్టీస్ పోయింది. మళ్లీ ఈ సినిమా కోసం క్రికెట్‌లో ట్రైనింగ్ తీసుకున్నాను. ప్రొఫెషనల్‌ క్రికెటర్‌లా కనిపించాలని అనుకున్నాను.
 
- నేను చేసే ప్రతీ సినిమా కథను మా నాన్నతో చర్చిస్తాను. కానీ చివరకు నా నిర్ణయం మీదే వదిలేస్తారు.. ముందు కథ నాకు నచ్చాలి. కథతో కనెక్ట్ అయ్యాననిపిస్తేనే ఒప్పుకుంటాను.
 
నిర్మాత, కెమెరామెన్ జ్ఞానశేఖర్ అందరినీ బాగా చూసుకుంటారు. ఆర్టిస్ట్స్ కంఫర్ట్‌గా ఫీలయ్యేలా చూసుకుంటారు. అండర్ వాటర్‌లో కొన్ని సీన్స్ తీయాలి. మాతో పాటు బాబా గారు కూడా ఉండేవారు. విజువల్‌గా ఇంత బాగా రావడానికి బాబా గారు కారణం. వాటిని డైలాగ్స్‌తో సాయి మాధవ్ బుర్రా గారు ఇంకా అద్భుతంగా మలిచారు.
 
- పెద్ద పెద్ద హిట్‌లు అయిన సినిమాలు కూడా కొన్ని రోజులే గుర్తుంటాయి. కానీ సినిమాలోని ఎమోషన్ మాత్రం కనెక్ట్ అయితే అవి ఎక్కువగా కాలం గుర్తుండిపోతాయి.అలా ఎమోషన్ నాకు కనెక్ట్ కాలేకపోతే సినిమాలు చేయలేను.. ఇన్ని సినిమాలు చేయాలని కాదు.. వచ్చే పదేళ్లలో ఐదు సినిమాలు చేసినా కూడా మంచివే చేయాలని అనుకుంటాను.
 
- ప్రస్తుతం నేను మనుచరిత్ర చేస్తున్నాను. గమనం విడుదలకు సిద్దంగా ఉంది. నాని గారి ప్రొడక్షన్‌లో మీట్ క్యూట్ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాను. మరో రెండు సినిమాలకు సైన్ చేశాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాటర్ బేబీ అంటూ బికినీతో ఫోటోను షేర్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్