Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బోల్డ్ పాత్రలు కూడా చేస్తాను - ప్రియాంక జవాల్కర్

Advertiesment
బోల్డ్ పాత్రలు కూడా చేస్తాను  - ప్రియాంక జవాల్కర్
, ఆదివారం, 5 డిశెంబరు 2021 (18:39 IST)
Priyanka Jawalkar
సినిమాలేకాదు. వెబ్ సిరీస్ కూడా చేస్తాను. గ‌తంలో నెట్ ఫ్లిక్స్ అప్రోచ్ అయ్యారు. కథ డిమాండ్  చేస్తే ఎలాంటి పాత్రనైనా చేస్తాను. బోల్డ్ కారెక్టర్ కూడా చేస్తాను. అర్జున్ రెడ్డి సినిమాను అందరూ బోల్డ్ అన్నారు. కానీ నాకు చాలా నచ్చింది- అని ప్రియాంక జవాల్కర్ పేర్కొంది. 
 
`గమనం` సినిమాతో సంజనా రావు దర్శకురాలిగా  పరిచయం కాబోతోన్నారు. శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించారు. క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల‌ 10న విడుదల చేయబోతోన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు
 
- నిర్మాత జ్ఞానశేఖర్ గారు మొదటగా ఈ సినిమా కోసం నన్ను అడిగారు. ముస్లిం అమ్మాయి పాత్ర కావడంతో బుర్ఖా వేసి లుక్ టెస్ట్ చేశారు. ఓకే అనుకున్నారు. అలా ఈ గమనం సినిమాలోకి వచ్చాను. ఇందులో నా పాత్రకు ఎక్కువగా డైలాగ్స్ ఉండవు. కేవలం కళ్లతోనే నటించాల్సి ఉంటుంది. అదే కొంచెం కష్టంగా అనిపించింది.
 
- నా పాత్ర పేరు ఝారా. ఆ కారెక్టర్ కోసం కొన్ని రిఫరెన్స్‌లు తీసుకున్నాను. నిత్య మీనన్ నటించిన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాను చూశాను. కానీ పాత్రను సరిగ్గా అర్థం చేసుకునేందుకు నాలుగు రోజులు పట్టింది. నా చిన్నతనంలో మా చుట్టు పక్కలా ముస్లిం ఫ్యామిలీలు ఉండేవారు. వారు ఎలా ఉంటారు.. ఎలా మాట్లాడతారు అనేవి తెలుసు. అలా ఈ పాత్రను పోషించడం కాస్త ఈజీగా మారింది.
 
- లేడీ డైరెక్టర్ కావడంతో సుజనా రావు నాకు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. షూటింగ్ అయిపోయాక మరింత క్లోజ్ అయ్యాం. లేడీ డైరెక్టర్ అవడంతో నాకు ఏమైనా సమస్యలున్నా కూడా షేర్ చేసుకునేదాన్ని.
 
 - శివ కందుకూరితో ఇది వరకే చూసీ చూడంగానే సినిమాను చేయాల్సింది. కానీ మిస్ అయింది. మళ్లీ మధ్యలో ఓ సినిమా కూడా మిస్ అయింది. మొత్తానికి గమనం సినిమాతో కుదిరింది. మేం ఇద్దరం ఫ్రెండ్స్. ఆయన్ను చూసి సిగ్గుపడాలని డైరెక్టర్ చెప్పేవారు. కానీ ఫ్రెండ్స్‌తో అలా ఎలా చేయగలం.
 
చారు హాసన్ గారి నటన గురించి చెప్పడానికి వ‌య‌స్సు స‌రిపోదు. ఆయనతో వర్షంలో ఓ సీన్ ఉంటుంది. నేను జాగ్రత్తగా చేయాలని అనుకున్నాను. ఎందుకంటే రెండో టేక్ తీసుకుంటే ఆయనకు ఇబ్బంది కలుగుతుంది అనుకున్నాను. ఆయన చాలా మంచివారు.
 
- సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తూ ఉంటే కెరీర్ స్లో అవుతుందనే భయం ఉంటుంది. అలా అని వచ్చిన సినిమాలన్నీ ఫటా ఫట్ చేస్తే ఫ్లాపులు వస్తే పరిస్థితి ఏంటనే భయం కూడా ఉంటుంది. అందుకే నాకు కథ నచ్చితేనే ఒప్పుకుంటాను. నాకు అందరు హీరోలతో పని చేయాలని ఉంది. ఓ లవ్ స్టోరీ సినిమా చేయాలని ఉంది. అందులో అయితే హీరోతో సమానంగా కారెక్టర్ ఉంటుంది.
 
- టాక్సీవాలా సినిమా సక్సెస్‌ను వాడుకోలేకపోయాను అని కొంత మంది అంటారు. నాక్కూడా ఒక్కోసారి అనిపిస్తుంది. కానీ విధిని మనం మార్చలేం. కొన్ని సినిమాలు మనకు వద్దనుకున్నా వస్తాయి. ఎస్ఆర్ కళ్యాణమండపం, తిమ్మరుసు ఇంత హిట్ అవుతాయని నేను కూడా అనుకోలేదు. గమనం సినిమా కూడా హిట్ అవుతుందని అనుకుంటున్నాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగార్రాజు నుంచి నా కోసం పాట వ‌చ్చేసింది