ఫిబ్ర‌వ‌రి 19న ఆడవాళ్లు మీకు జోహార్లు ట్రైల‌ర్‌

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (16:30 IST)
Sharwanand, Radhika, oorvasi and others
హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన ప్ర‌తి ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కు విశేష స్పంద‌న‌ ల‌భించింది.
 
రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా సినిమా బజ్‌ను మ‌రింత‌ పెంచడానికి సహాయపడుతోంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన  సినిమా టైటిల్‌ ట్రాక్ , అలాగే వేలంటైన్స్ డే కానుక‌గా రిలీజ్ చేసిన  ఓ ఆధ్య పాట‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.
 
ఇప్ప‌టికే రిలీజ్ చేసిన టీజ‌ర్ ట్రెమండ‌స్ రెస్పాన్స్ ద‌క్కించుకోగా  ఈ మూవీ ట్రైల‌ర్‌ను ఫిబ్ర‌వ‌రి  19న విడుద‌ల‌చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్లో  శ‌ర్వా త‌న ఫ్యామిలీతో ఎంత ఆప్యాయంగా ఉంటారో చూపించారు. ఈ పోస్ట‌ర్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది.
 
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు.
 
కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ  వంటి సీనియ‌ర్ యాక్ట‌ర్స్‌ క‌లిసి న‌టిస్తుండ‌డం ఈ సినిమాలో మ‌రో విశేషం. సుజిత్ సారంగ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.
 
నటీనటులు : శర్వానంద్, రష్మిక మందన్నా, వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు
 
సాంకేతిక బృందం
దర్శకత్వం: తిరుమల కిషోర్
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
బ్యానర్ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
సంగీతం, దేవీ శ్రీ ప్రసాద్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్
కొరియోగ్రఫర్: దినేష్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొంథా తుఫాను మృతులకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా : సీఎం రేవంత్ రెడ్డి

శ్రీవారి మెట్టు నడకదారిలో చిరుతపులి.. భక్తులు కేకలు.. 800వ మెట్టు దగ్గర..?

మోహన్ బాబు యూనివర్సిటీలో సమర్థ 2025, 36-గంటల జాతీయ హ్యాకథాన్

Montha Cyclone: జగన్‌కి తుఫాను గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.. రవి కుమార్

డీప్ ఫేక్‌లపై ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ సజ్జనార్ ప్రత్యేక దృష్టి... ఇక వారికి చుక్కలేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments