Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామారావు ఆన్ డ్యూటీ కోసం రెండు డేట్స్ ఫిక్స్ చేశారు

Advertiesment
రామారావు ఆన్ డ్యూటీ కోసం రెండు డేట్స్ ఫిక్స్ చేశారు
, మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (17:00 IST)
Ravi Teja, Rama Rao on Duty
మాస్ మహారాజా రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
 
ఈ రోజు మేకర్లు ఈ  మూవీకి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించారు. రెండు డేట్లను మేకర్లు లాక్ చేశారు. మార్చి 25న లేదా ఏప్రిల్ 15న ఈ మూవీని విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు.
 
‘మా చిత్రంపై మాకు ప్రేమ అలానే ఇతర చిత్రాలపై అమితమైన గౌరవం కూడా ఉంది. మార్చి 25న రామారావు ఆన్ డ్యూటీ సినిమాను విడుదల చేయాలని అనుకున్నాం. కానీ మారిన పరిస్థితులను బట్టి మా సినిమాను మార్చి 25న లేదా ఏప్రిల్ 15న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం’ అని నిర్మాతలు ప్రకటించారు.
 
దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఇంకా ముఖ్యమైన నటీనటులెంతో మంది ఉన్నారు.
 
సామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
ఈ చిత్రం యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్  పోస్టర్‌కు అద్బుతమైన స్పందన వచ్చింది.
 
నటీనటులు : రవితేజ, దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, నరేష్, పవిత్రా లోకేష్, సార్పట్టా జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తణికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ఈరోజుల్లో శ్రీ, మధుసూదన్ రావు, సురేఖా వాణి తదితరులు
 
సాంకేతిక బృందం
 
కథ, కథనం, మాటలు, దర్వకత్వం : శరత్ మాండవ
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
బ్యానర్ : ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ, ఆర్‌టీ టీం వర్క్స్
సంగీతం : సామ్ సీఎస్
సినిమాటోగ్రఫీ : సత్యన్ సూర్యన్ ఐఎస్‌సీ
ఎడిటర్ : ప్రవీణ్ కేఎల్
ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రహ్మానందం 66వ పుట్టినరోజు.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్