స‌మంత నెగెటివ్ పాత్ర చేయ‌నుందా! (video)

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (10:49 IST)
Samantha
2010లో ప్రారంభమైన కెరీర్‌లో సమంత ఎదిగి, ప్రయోగాలు చేసింది.  చివరకు తన సముచిత స్థానాన్ని సంపాదించుకుంది. లేటెస్ట్‌గా శాకుంత‌లం అనే సినిమాలో న‌టిస్తోంది. ఏప్రిల్ 28న ఆమె పుట్టిన‌రోజు. చిత్ర యూనిట్ ఆమెను శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ,  ఈ చిత్రం గ్లింప్స్ తోపాటు మ‌రిన్ని వివ‌రాలు మే5న విడుద‌ల చేస్తామ‌ని గురువారంనాడు ప్ర‌క‌టించింది. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం టెక్నిక‌ల్‌గా హై స్థాయిలో వుండేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. పౌరాణిక గాత దుష్యంతుల శ‌కుంత‌ల క‌థ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.
 
ఇదిలా వుండ‌గా, నేడు స‌మంత ప్ర‌భు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆమెను చిత్ర ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఓబేబీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్` ది ఫ్యామిలీ మ్యాన్‌`లో తమిళ రెబల్ రాజీగా భిన్న‌మైన పాత్ర‌లు పోషించింది. అయితే 2012 హిందీ చిత్రం `ఏక్ దీవానా థా`లో ఆమె అతిధి పాత్ర పోషించింది. కానీ చాలా మంది  చిత్రాన్ని చూడలేదు. కాబట్టి ది ఫ్యామిలీ మ్యాన్ హిందీ సినిమానే మొద‌టిగా అంద‌రూ అనుకుంటున్నారు. తాజాగా ఆమె నెగెటివ్ షేడ్స్ వున్న పాత్రను పోషించ‌డానికి సిద్ధ‌మే అని ప్ర‌క‌టించింది. ఆ పాత్ర ఏ సినిమాలో వుండ‌బోతుందో కొద్దిరోజుల్లో తెలియ‌నుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Drones: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మందుల సరఫరాకు రంగంలోకి డ్రోన్‌లు

పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ - అమ్మకానికి పెట్టిన పాక్ పాలకులు

పైరసీ చేసినందుకు చింతిస్తున్నా, వైజాగ్‌లో రెస్టారెంట్ పెడ్తా: ఐబొమ్మ రవి

ఉప్పాడ సముద్ర తీరం వెంబడి కాలుష్యానికి చెక్.. పవన్ పక్కా ప్లాన్

తనకంటే అందంగా ఉన్నారని అసూయ.. ముగ్గురు బాలికలను చంపేసిన కిరాతక లేడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments