Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సమంత నోట అలాంటి మాటలా..? హర్ట్ అయిన ఫ్యాన్స్? (video)

Advertiesment
Samantha akkineni
Samantha akkineni
టాలీవుడ్ హీరోయిన్ సమంత తాజాగా శాకుంతలం సినిమా షూటింగ్‌ను కంప్లీట్ అయింది. యశోద సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. తెలుగులోనే కాకుండా తమిళంలో కాతువక్కుల రెండు కాదల్ ఏప్రిల్ 28 న రిలీజ్ కాబోతోంది. 
 
సమంతతో పాటుగా కోలీవుడ్ బ్యూటీ నయనతార కూడా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.  ఈ సినిమాకు నయనతార బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. 
 
ఇక ఈ సినిమాలో ముఖ్య పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే ఈ సినిమా సూపర్ హిట్ కావడం ఖాయం అనిపిస్తుంది. ఇద్దరమ్మాయిలు ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది. 
 
అలాగే అబ్బాయికి ఆ ఇద్దరమ్మాయిలు నచ్చి ఇద్దరినీ పెళ్లి చేసుకుంటానంటే వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది డైరెక్టర్ విగ్నేష్ శివన్ ఓ కామెడీ జోనర్‌లో ఈ సినిమాని తెరకెక్కించాడు. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్‌లో సమంత ఓ సీన్‌లో ఆయనతో నేను పడుకున్నాను అంటూ ఒక డైలాగ్ చెబుతుంది. 
 
ఆ ట్రైలర్ చూసిన అభిమానులకు ఆమె చెప్పిన డైలాగ్ నచ్చట్లేదు. సమంత నోటి నుండి అలా మాటలు రావడం వల్ల ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతోంది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రణస్థలిలో ఫైట్ సీక్వెన్స్ హైలైట్ - ద‌ర్శ‌కుడు క్రిష్‌