Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్క్ ఆంటోని గా విశాల్ న్యూ లుక్ ఆకట్టుకుంటున్న విజువల్స్

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2023 (17:03 IST)
Mark Antony - Visha
కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన హీరో విశాల్. పలు యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాల్లో తన నటనతో అశేష అభిమాన వర్గాన్ని సంపాదించుకున్న ఈ హీరో.. ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘మార్క్ ఆంటోని’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పాన్ ఇండియా మూవీగా గ్రాండ్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మరో పాపులర్ హీరో ఎస్.జె.సూర్య నటిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఎస్ వినోద్ కుమార్ నిర్మతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో విశాల్ కి జోడీగా రీతూ వర్మ నటిస్తోంది. 
 
ఓ వైపు సినిమా పనులు వేగంగా ఫినిష్ చేస్తూనే మరోవైపు జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా 'ఐ లవ్ యూ నే' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మాస్ బీట్ హైలైట్ కాగా.. విశాల్ గెటప్ ఆకట్టుకుంటోంది. శ్రీ మణి రాసిన లిరిక్స్, రామ్ మిరియాల గాత్రం ఈ పాటకు ప్రాణం పోశాయి. రియాలిటీకి దగ్గరగా ఉండే పదాలతో సాంగ్ ఫ్లో సాగిపోయింది. ఈ పాటలో హీరోహీరోయిన్ల మాస్ స్టెప్స్, అందుకు తగట్టుగా వస్తున్న ఫాస్ట్ బీట్ ఆకట్టుకుంటోంది. దీంతో విడుదల చేసిన కాసేపట్లోనే ఈ సాంగ్ వైరల్ గా మారింది. 
 
ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వినాయక చవితి పండుగను పురస్కరించుకుని సెప్టెంబర్ 15న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ తెలిపారు. అంతకు ముందు ఈ సినిమా నుంచి విశాల్ ఆలపించిన అదరద గుండె అదరద మావా.. బెదరగ బెంగ మొదలవదా సాంగ్ రిలీజ్ చేసి ఆకట్టుకున్న మేకర్స్.. ఇప్పుడు ఐ లవ్ యూ నే లిరికల్ సాంగ్‌తో యూత్ మొత్తాన్ని అట్రాక్ట్ చేశారు. ఇటీవల రిలీజైన ఈ మూవీ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 
 
ఈ చిత్రంలో విశాల్ లుక్ సరికొత్తగా ఉండనుందని ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ స్పష్టం చేశాయి. విశాల్, సూర్య ఇద్దరూ కూడా ఫుల్ ఎనర్జీతో రంగంలోకి దిగుతున్నారు. ఈ చిత్రానికి సంగీతం జి.వి. ప్రకాష్ అందిస్తుండగా.. యాక్షన్ సన్నివేశాలను పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్, కనల్ కణ్ణన్, దినేష్ సుబ్బరాయన్ తీర్చిదిద్దుతున్నారు. టైమ్ ట్రావెల్ థీమ్ చుట్టూ తిరిగే కథతో ఈ మార్క్ ఆంటోనీ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఎస్.జె.సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణుడి మరణం- పోలవరం వెనుక అనేక కారణాలు.. వైఎస్ షర్మిల

ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజనపై తెలుగు రాష్ట్రాలకు నో ఇంట్రెస్ట్

తెలంగాణలో కూడా జనసేన యాక్టివ్‌గా వుంటుంది.. పవన్ కళ్యాణ్

తిరుమలలో ఏనుగుల గుంపు హల్ చల్ -భయాందోళనలో భక్తులు

ఏపీ ఎన్నికల ఫలితాలు.. రాజకీయాలు వద్దు.. హిమాలయాలకు జగన్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments