Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క- విరాట్ కోహ్లీ రెండో హనీమూన్- నీటి కొరతతో కష్టాలు?

కొత్త పెళ్లి జంట అనుష్క- విరాట్ కోహ్లీ రెండో హనీమూన్ ఆనందాన్ని నీళ్ల కరువు కబళించినట్లైంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ల కోసం టీమిండియా కేప్‌టౌన్ వెళ్లిన సంగతి తెలిసిందే. వీరితో పాటు విరుష్క కూడా దక్షిణాఫ

Webdunia
మంగళవారం, 2 జనవరి 2018 (16:58 IST)
కొత్త పెళ్లి జంట అనుష్క- విరాట్ కోహ్లీ రెండో హనీమూన్ ఆనందాన్ని నీళ్ల కరువు కబళించినట్లైంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ల కోసం టీమిండియా కేప్‌టౌన్ వెళ్లిన సంగతి తెలిసిందే. వీరితో పాటు విరుష్క కూడా దక్షిణాఫ్రికాకు వెళ్లారు. అయితే కేప్‌టౌన్‌లో వేసవి కావడంతో నీటి కొరత వేధిస్తోంది. నీళ్ల కరువు వచ్చింది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప్రజలు నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
 
ఆ దేశ ప్రజలతో పాటు ప‌ర్యాట‌కులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ఈ నీళ్ల‌క‌రువు తీవ్ర‌త‌ను తెలియజేయ‌డానికి కేప్‌టౌన్ విమానాశ్ర‌యంలోనే ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నారు. ప‌ర్యాట‌కులు నీళ్లు త‌క్కువ‌గా వాడాల‌ని సూచనలు చేస్తున్నారు. 
 
తాజ్, స‌ద‌ర‌న్ స‌న్ వాట‌ర్‌ఫ్రంట్ వంటి ప్ర‌ముఖ హోట‌ళ్లు కూడా వీలైనంత మేర‌కు త‌క్కువ నీళ్లు వాడాల‌ని సూచిస్తున్నాయి. ఇప్ప‌టికే కేప్‌టౌన్ ప‌ట్ట‌ణ యంత్రాంగం ఆరో స్థాయి హెచ్చ‌రిక‌ల‌ను కూడా జారీ చేసింది. వీలైనంత వరకు పర్యాటకులకు నీటి ఇబ్బంది కలగకుండా చేసేందుకు హోటల్ యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments