Allu Arvind, Bunny Vasu, Kiran Abbavaram, Kashmira Pardeshi and others
అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `వినరో భాగ్యము విష్ణుకథ`. కిరణ్ అబ్బవరం, కశ్మీర పర్ధేశీ జంటగా నటిస్తున్నారు. శుక్రవారంనాడు జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అల్లు అరవింద్ ముఖ్య అతిధిగా హాజరై చిత్ర ప్రారంభ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Allu Anvita claps
అల్లు అన్విత హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ కశ్మీరా పర్ధేశీల పై క్లాప్ తో చిత్రాన్ని ప్రారంభించారు. నిర్మాత బన్నీవాసు కెమెరా స్విఛ్ ఆన్ చేశారు. ఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బురూ దర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నారు. ప్రఖ్యాత దర్శకులు ప్రశాంత్ నీల్, కిషోర్ తిరుమల దగ్గర మురిళి కిషోర్ గతంలో పనిచేశారు.
ఓ వినూత్నమైన కథతో ఈ నూతన చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా నిర్మాత బన్నీవాసు తెలిపారు. ఈ చిత్రానికి వినరో భాగ్యము విష్ణు కథ అనే టైటిల్ పెట్టినట్లుగా నిర్మాత బన్నీవాసు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ అందిస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా బాబు వ్యవహరిస్తున్నారు. సత్యగమిడి, శరత్ చంద్ర నాయుడు ఎక్స్ క్యూటివ్ నిర్మాతలు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా విడుదల అవ్వనున్నాయి.