సుక్కు అంటే కాపీ కాట్. కాపీ చేయడంలో ఆయనే గ్రేట్.. 2018నుంచి ఆయనతో టచ్‌లో వున్నాను. పుష్ప కథ నేను సుకుమార్‌కు చెప్పాను. రకరకాల సమయాల్లో చెప్పాను. ఈ కథను ఇచ్చిన తర్వాత నాతో కాంటాక్ట్ లేదు. ఈరోజు ఎలాంటి క్రెడిట్ ఇవ్వకుండా రిలీజ్ చేశారు అంటూ సెన్సేషనల్ కామెంట్ చేశాడు జర్నలిస్టు ఆదినారాయణ. ఆయన చిత్తూరులో క్రైం రిపోర్టర్. ఆయనతో చిట్‌చాట్.
- నేను రంగస్థలం చూశాక రివ్యూ రాశాను. దానిని సుకుమార్‌గారు చదివి.. నాకు ఫోన్‌చేశారు. అలా ఇద్దరు కలిశాం. రంగస్థలం రివ్యూ పరంగా ఎంతో మెచ్చుకున్నారు నన్ను.
మరి పుష్ప కథ మీరు చెప్పిందే తీశారా?
రంగస్థలం 100వ రోజుకు సుకుమార్‌తో నాకు అపాయింట్మెట్ కుదిరింది. అక్కడే అందరూ అసిస్టెంట్లను పిలిపించి నన్ను పరిచయం చేశారు. చూడండయ్యా. రచయిత అంటే ఇలా వుండాలని వారికి చెప్పారు. ఆ తర్వాత మీరు మంచి రచయిత టీవీ మీడియాలో ఎందుకున్నారు. నా వైపు రండి అని చెప్పారు. ఆ తర్వాత కాపీ తాగుతూ మాట్లాడుకున్నాం.
మరి ఆ టైంలో ఎలాంటి కథపై మీ ఇద్దరి మధ్య చర్చ జరిగింది?
కె.జి.ఎఫ్. లాంటి కథ కావాలని అని అడిగారు. నేను క్రైం రిపోర్ట్ చూస్తుంటాను. ఎన్నో కథలు నాకు తెలుసు. తిరుపతి టాస్క్ ఫోర్స్ వారు కూడా నన్ను అడిగేవారు. ఎర్రచందనం అరికట్టేవిధంగా కథ రాయండి అని. ఆ క్రమంలో నేను ఒకటి రాసుకుని వున్నా. దాన్ని సుకుమార్‌కు చెప్పా. మొదటిది ఇసుక, రెండోది శాండిల్ కథలు వున్నాయని చెప్పా. రెడ్ శాండిల్లో అంత వుందా అన్నాడు. ఆ కథను ఆమ్రపాలి అనే పేరుతో కథను రాసుకున్నా.
- ఎర్రచందనం తోలే డ్రైవర్లు చాలా రిస్క్ తీసుకుంటారు. ఒక్కొక్కరు వీరప్పన్ రేంజ్‌లో ఫీల్ అవుతారు. అని అక్కడి విషయాలు సుకుమార్‌కు చెప్పాను. రంగస్థలం తర్వాత సుకుమార్‌కు మాస్ రేంజ్‌లో కథ పడాలని వుంది. అలా వెతికే క్రమంలో కెజి.ఎఫ్ లాంటి కథ అడిగారు. నేను ఎర్ర బంగారం అని పుష్ప కథ చెప్పాను.
- ఆ తర్వాత కథ విన్నాక ఈ లైన్ ఎక్కడా చెప్పకూడదు అని సుకుమార్ నాతో అన్నాడు. అలాగే అన్నాను. కథంతా వినేశారు. ఆ తర్వాత నా వాట్సప్ నెంబర్ బ్లాక్ చేశారు.
మరి మీరు చెప్పేది నిజమని నిరూపించగలరా?
నా వాట్సప్ బ్లాక్ చేశాక. జీమెయిల్‌కు మెసేజ్‌లు పంపాను. ఇవిగో... అంటూ ఆర్య సుక్కు జీమెయల్.కామ్‌కు నేను కాన్‌వర్‌జేషన్ జరిపాను అంటూ సుకృత వేణి అనే పేరుతో ఆయన నాకు మెసేజ్ పంపారు అంటూ చూపించారు.
- ఆ తర్వాత మీరెందుకు నా ఫోన్ బ్లాక్ చేశారని అడిగితే! మీదేకాదు. నేను వేరే పనిలో బిజీగా వుండడంతో మా అసిస్టెంట్ల నెంబర్లు కూడా కట్ చేశానని సమాధానం చెప్పారు. ఆ తర్వాత ఓ ఫోన్ నెంబర్ ఇచ్చి అసిస్టెంట్లకు అప్పగించారు.
- వారికి కూడా కథ చెప్పాను. అందులో ఒకతను. మీరు చెప్పే కథ 10 కోట్లకు పైగా వుంటుంది. అంత రేంజ్ కథ కాకుండా ఇంకా తక్కువ రేంజ్‌లో కథను చెప్పమని అడిగారు అంటూ వివరించారు అంటూ చెప్పారు.