మ‌హేష్‌బాబు, రాజ‌మౌళి చిత్రం కోసం స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించిన‌ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (14:25 IST)
Vijayendra Prasad, M.M. Srilekha
సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎస్ఎస్ రాజమౌళి సినిమా స్క్రిప్ట్ వర్క్ ఊపందుకున్నట్లు సమాచారం. మంగళవారం రాత్రి, ఎం.ఎం.శ్రీలేఖ త‌న సోష‌ల్ మీడియా ఫొటోను పోస్ట్ చేసారు. రాజమౌళి తండ్రి రచయిత కెవి విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
 
"ప్రసాద్ నాన్న గారూ, రాజమౌళి అన్న, మహేష్ బాబుల  క్రేజీయస్ట్ కాంబినేషన్ ప్రాజెక్ట్ కోసం ఆల్ ది బెస్ట్. నేనూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను" అని శ్రీలేఖ రాశారు. కాగా, ఈ క్రేజ్ ప్రాజెక్ట్‌పై గ‌తంలో విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంట‌ర్వ్యూలో సూచాయ‌గా చెబుతూ, త్వ‌ర‌లో హాలీవుడ్ స్థాయిలో మ‌హేష్‌బాబుతో సినిమా వుండ‌బోతోంద‌ని వెల్ల‌డించారు. ఇప్పుడు ఎట్ట‌కేల‌కు ఈ చిత్ర క‌థ గురించి బుధ‌వారంనాడు స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించిన‌ట్లు అర్థ‌మ‌వుతుంది. ఇక ఈ క‌థ ఓ హాలీవుడ్ క‌థ‌ను స్పూర్తిగా తీసుకుని చేస్తున్న‌ట్లు క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. అభిమానుల‌కు పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌నున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ ఎస్ఐ 4 సార్లు అత్యాచారం చేశాడు.. వైద్యురాలి ఆత్మహత్య కేసులో ట్విస్ట్

కర్నూలు బస్సు అగ్నిప్రమాదంలో ఇద్దరు టెక్కీలు మృతి

Kurnool : కర్నూలు బస్సు ప్రమాదం.. డ్రైవర్ కనిపించలేదు.. ఏఐ వీడియో వైరల్

కర్నూలు బస్సు ప్రమాదం : సీటింగ్ అనుమతితో స్లీపర్‌గా మార్చారు...

కర్నూలు ప్రమాదానికి నిర్లక్ష్యమే కారమణమా? సీఎం చంద్రబాబు హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments