"సర్కార్" సునామీ... జస్ట్ 2 డేస్.. రూ.200 కోట్లు కొల్లగొట్టింది...

Webdunia
గురువారం, 8 నవంబరు 2018 (13:06 IST)
తమిళ హీరో ఇళయ దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం సర్కార్. ఏఆర్ మురుగదాస్ దర్శకుడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించగా, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రను పోషించింది. ఈ చిత్రం దీపావళి పండుగకు (నవంబరు 6వ తేదీ) విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ముఖ్యంగా, టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఫలితంగా కేవలం 2 రోజుల్లో రూ.200 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. 
 
ఈ సినిమా మొదటిరోజే కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఒక్క మొదటిరోజే తమిళనాడులో దాదాపు రూ.30 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.2.32కోట్లు, కేరళలో దాదాపు రూ.6 కోట్లను కలెక్ట్‌ చేసి.. సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. 
 
బ్రిటన్, సింగపూర్‌, ఆస్ట్రేలియా, అమెరికాల్లో ఈ సినిమా దూసుకెళ్తోంది. ఈ మూవీ రెండు రోజుల్లోనే రూ.వంద కోట్ల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాను దాదాపు 3400 స్క్రీన్స్‌ప విడుదల చేశారు. ఇక ఈ చిత్రం "మెర్సెల్‌" రికార్డులను అధిగమించేట్టుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Prakash Raj: మమ్ముట్టిలాంటి గొప్ప నటుడికి అలాంటి అవార్డులు అవసరం లేదు.. ప్రకాశ్ రాజ్

కరూర్ తొక్కిసలాట తర్వాత బుద్ధి వచ్చిందా.. తొండర్ అని పేరిట వాలంటీర్ల విభాగం

కొత్త అలెర్ట్: ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి

రాత్రి 11 గంటల ప్రాంతంలో కారులో కూర్చుని మాట్లాడుకోవడం అవసరమా? కోవై రేప్ నిందితుల అరెస్ట్

Constable: ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై అప్పుల్లో కూరుకుపోయాడు... రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments