Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్త ఫిగర్‌తో క్రాకర్స్ కాలుస్తూ కలరింగ్ ఇస్తున్న 'టాక్సీవాలా'

Advertiesment
కొత్త ఫిగర్‌తో క్రాకర్స్ కాలుస్తూ కలరింగ్ ఇస్తున్న 'టాక్సీవాలా'
, బుధవారం, 7 నవంబరు 2018 (16:41 IST)
టాలీవుడ్ యువ సంచలనం విజయ్ దేవరకొండ. జయాపజయాలతో ఎలాంటి సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తూ, అనుకున్న సమయానికి విడుదల చేస్తున్న హీరో. 'గీత గోవిందం' వంటి భారీ హిట్ చిత్రం తర్వాత "నోటా"తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. 
 
ఇపుడు "టాక్సీవాలా" సినిమాతో ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకురానున్నాడు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సరసన ప్రియాంకా జవల్కర్ హీరోయిన్‌గా నటించింది.
 
అయితే తాజాగా దివాళీ శుభాకాంక్షలు తెలుపుతూ.. విడుదల తేదీతో కూడిన మరో కొత్త పోస్టర్ను యూనిట్ సభ్యులు బయటకు వదిలారు. ఈ పోస్టర్‌లో యంగ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ ప్రియాంకా జవల్కర్‌తో కలిసి క్రాకర్స్ కాలుస్తూ కనిపించాడు. 
 
ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ పోస్టర్ చూసిన ఆయన అభిమానులు మాత్రం.. "మా హీరో క్రాకర్స్ కాలుస్తూ బాగా కలరింగ్ ఇస్తున్నాడు" అని చెప్పుకోవటం విశేషం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెర్రీ - అఖిల్ మధ్య వార్.. నువ్వా నేనా తేల్చుకుందామంటున్న హీరోలు...