Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆల్ ఇండియా మోస్ట్ డిజైరబుల్ లిస్టులో విజయ్ దేవరకొండ

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (16:27 IST)
Vijay Devarakonda
బాలీవుడ్ స్టార్స్ ను మించిన క్రేజ్, స్టార్ క్రికెటర్లను మించిన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు విజయ్ దేవరకొండ. ఈ టాలీవుడ్ స్టార్ రిసెంంట్ గా హైదరాబాద్ "టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్" గా టాప్ ప్లేస్ సంపాదించుకోగా ఇప్పుడు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 50" లో నేషనల్ వైడ్ గా రెండో స్థానం దక్కించుకున్నారు. పోయిన సంవత్సరం మూడో ప్లేస్ లో ఉన్న విజయ్ ఇప్పుడు ఏకంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. రన్వీర్ సింగ్, వికీ కౌషల్, రణ్ బీర్ కపూర్ లాంటి బాలీవుడ్ స్టార్స్ అంతా విజయ్ వెనకే ఉండిపోయారు.
 
ఆన్ లైన్ ఓటింగ్, జ్యూరీ అభిప్రాయాల ఆధారంగా వివిధ రంగాల్లోని సెలబ్రిటీలను టాప్ 50 మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ తయారు చేసింది టైమ్స్ గ్రూప్. నేషనల్ వైడ్ గా జరిగిన ఆన్ లైన్ ఓటింగ్ లో దివంగత బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తొలి స్థానం దక్కించుకోగా రెండో స్థానంలో విజయ్ దేవరకొండ నిలిచారు. ఆదిత్య రాయ్ కపూర్, వికీ కౌశల్, దుల్కర్ సల్మాన్ తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు.
 
"అర్జున్ రెడ్డి" సినిమా హిందీ రీమేక్ "కబీర్ సింగ్" తో బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ బాగా పరిచయం అయ్యారు. ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమా "లైగర్" తో హిందీ పరిశ్రమకు విజయ్ దేవరకొండ మరింత దగ్గరవుతున్నారు. "టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 50" లిస్ట్ లో విజయ్ సెకండ్ ప్లేస్ గెల్చుకోవడానికి తన ప్యాన్ ఇండియా స్టార్ ఇమేజ్ కూడా దోహదపడింది.దీనితో ఆయన చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా "లైగర్" మీద భారీ అంచనాలు  ఏర్పడ్డాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments