Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను క‌స‌క్ అంటే మీరంతా ఫ‌స‌క్ అంటున్న మోహ‌న్‌బాబు (సన్ ఆఫ్ ఇండియా టీజర్)

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (16:39 IST)
Mohanbabu
మంచు మోహ‌న్‌బాబు న‌టించిన తాజా సినిమా `స‌న్ ఆఫ్ ఇండియా`. డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ‌ ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ ప‌తాకంపై రూపొందుతోంది. ఈ చిత్రంలోని టీజ‌ర్‌ను శుక్ర‌వారంనాడు 12 గంట‌ల త‌ర్వాత ఆన్‌లైన్‌లో త‌మిళ‌స్టార్ సూర్య ఆవిష్క‌రించారు. క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబుగారి సినిమా టీజ‌ర్ ఆవిష్క‌రించ‌డం గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు సూర్య ట్వీట్ చేశాడు.
 
ఇక ఈ టీజ‌ర్ మెగాస్టార్ చిరంజీవి వాయిస్‌తో ఆరంభ‌మ‌వుతోంది. మోహ‌న్‌బాబు కేరెక్ట‌ర్‌ను ప‌రిచ‌యం చేస్తూ, మ‌న అంచ‌నాల‌కు అంద‌ని ఓ వ్య‌క్తిని ప‌రిచ‌యం చేయ‌బోతున్నా. త‌న రూటే సెప‌రేట్. త‌ను ఎప్పుడు ఎక్క‌డా వుంటాడో, ఎప్పుడు ఏ వేషంలో వుంటాడో ఆ దేవుడికే ఎరుక‌. త‌న బ్రెయిన్‌లో న్యూరాన్స్ ఎలాంటి థాట్స్ వ‌స్తాయో ఏ డాక్ట‌ర్‌కూ తెలీదు అని చెబుతారు. ఈ వాయిస్‌లోనే మోహ‌న్‌బాబు గెట‌ప్‌లు, యాక్ష‌న్ ఎపిసోడ్లు ద‌ర్శ‌న‌మిస్తాయి.
 
ఆ త‌ర్వాత, నేను చీక‌టిలో వుంటే వెలుతురును, వెలుతురులో వుంటే చీక‌టిని అంటూ మోహ‌న్‌బాబు డైలాగ్‌లు చెబుతారు. ఆ వెంట‌నే, వెరీ ఇంట్రెస్టింగ్‌.. అంటూ చిరు వాయిస్ వినిపిస్తుంది. ఫైన‌ల్‌గా, నేను ఇక్క‌డ క‌స‌క్ అంటే మీరు అక్క‌డ ఫ‌స‌క్ అంటూ.. యాక్ష‌న్‌తో ఎవ‌రికో వార్నింగ్ ఇస్తూ మోహ‌న్‌బాబు ట్విస్ట్‌ ఇస్తాడు. ఇక ఈసినిమా మోహ‌న్‌బాబు కెరీర్‌లో కొత్త‌గా అనిపిస్తుంది. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizianagaram: మహిళా పోలీసులకే రక్షణ కరువు.. జుట్టు పట్టి లాగి..? (video)

వీళ్ళు భలే దొంగలురా బాబూ... చోరీకొచ్చి ఏం తీసుకెళ్లారో తెలుసా? (Video)

మాట వినని విద్యార్థులు.. గుంజీలు తీసిన హెడ్మాస్టర్ (Video)

పెళ్లయిన వారానికే మాజీ ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (Video)

తండ్రిని చూడ్డానికి వచ్చి కన్నబిడ్డల్ని వదిలేసిన వెళ్లిపోయిన కసాయి తల్లి.. ఎక్కడ? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

తర్వాతి కథనం
Show comments