Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

దేవీ
మంగళవారం, 20 మే 2025 (15:23 IST)
Lawer new poster
విజయ్ ఆంటోని కెరీర్ ప్రారంభం నుంచీ కూడా కొత్త కథల్ని, డిఫరెంట్ కంటెంట్‌లతో  ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, పాటల రచయితగా, ఎడిటర్‌గా ఇలా అన్ని క్రాఫ్ట్‌ల మీద పట్టు ఉన్న  బహుముఖ ప్రజ్ఞాశాలి విజయ్ ఆంటోనీ. ప్రస్తుతం ఆయన తన కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. విజయ్ ఆంటోని కెరీర్‌లో 26వ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రకటన చేశారు. ‘లాయర్’ అంటూ విజయ్ ఆంటోని ఆడియెన్స్ ముందుకు రానున్నారు.
 
జెంటిల్ ఉమెన్‌ ఫేమ్ రైటర్ జాషువా సేతురామన్ ‘లాయర్’ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఆయన కథ, విజన్, మేకింగ్ మీద విజయ్ ఆంటోని ఎంతో నమ్మకంగా ఉన్నారు. ‘లాయర్’ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మిస్తున్న ఈ చిత్రం గ్రిప్పింగ్ కోర్ట్ డ్రామాగా రాబోతోంది. 
 
ఫాతిమా విజయ్ ఆంటోని కంపెనీ, విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ మీద మీరా విజయ్ ఆంటోని సమర్పణలో విజయ్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్రెడీ ప్రారంభం అయ్యాయి. రెగ్యులర్ షూట్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. నటీనటులు, సాంకేతిక బృందం మరియు ఇతర అంశాలకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు. ఈ మూవీని తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూఢచర్యం కేసులో సమీర్ అరెస్టు.. ఇంతకీ ఎవరీ సమీర్!!

Couple fight: రోడ్డుపైనే దంపతుల కొట్లాట.. బిడ్డను నేలకేసి కొట్టిన తల్లి (video)

పెళ్లై రెండు రోజులే.. వివాహ విందు కోసం సిద్ధంగా వున్నాడు.. ఇంతలో కరెంట్ షాక్‌తో మృతి

పాకిస్థాన్ ప్రాచీన ఆలయంలో ఘంటసాల పాట వినిపించిన జ్యోతి మల్హోత్రా!!

చిన్నారిపై అత్యాచారం - కన్నతల్లి సమక్షంలోనే ప్రియుడి పైశాచికత్వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments