Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

Advertiesment
Ananya Nagalla Opens

దేవీ

, మంగళవారం, 20 మే 2025 (11:20 IST)
Ananya Nagalla Opens
లెగ్దా డిజైన్ స్టూడియో' (Lekda Design Studio) ఇప్పుడు మరింత విస్తృత రూపంలో ముందుకొస్తోంది. ఈ స్టూడియో రెండో బ్రాంచ్‌ను టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అనన్య నాగళ్ల హబ్సిగూడలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ ప్రారంభోత్సవంలో ఫ్యాషన్ డిజైనర్ దివ్య కర్నాటి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఎన్‌విఎస్ఎస్ ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు దర్గా దయాకర్, బీఆర్ఎస్ నాయకులు మంద సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ స్ట్రీట్ వాక్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మోడల్స్ ఫ్యాషన్ డిజైన్లను ఆహ్లాదకరంగా ప్రదర్శించి, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
 
webdunia
Ananya Nagalla, Srinivas Goud, former MP Boora Narsayya Goud
ఈ సందర్భంగా టాలీవుడ్ నటి అనన్య నాగళ్ల మాట్లాడుతూ – "మహిళలు తమ కలల డిజైన్‌లు ధరించి స్వయం ప్రతిష్టను పొందడానికి లెగ్దా డిజైన్ స్టూడియో చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతో అభినందనీయమైనది. ప్రత్యేకించి మహిళలకు ఉపాధిని కల్పిస్తూ, వారి సృజనాత్మకతకు మద్దతుగా నిలుస్తున్న దివ్య కర్నాటి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ బ్రాంచ్‌ ద్వారా మ‌రెంద‌రో మహిళలు తమ ఫ్యాషన్ కలలను నిజం చేసుకుంటార‌నే విశ్వాసం ఉంది" అని ఆమె అన్నారు.
 
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. "అంత‌ర్జాతీయ స్థాయిలో హైద‌రాబాద్‌లో ఫ్యాష‌న్ స్టూడియో ఏర్పాటు చేయ‌డం అభినంద‌నీయం. ఎంతో మందికి ఉపాధి క‌ల్పించేలా దివ్య కర్నాటి.. లెగ్దా డిజైన్ స్టూడియో ఏర్పాటు చేశారు. అన్ని వ‌య‌సుల వారికి, అన్ని ర‌కాల వేడుక‌ల‌కు అవ‌స‌ర‌మైన డిజైన్స్ ఇక్క‌డ దొరుకుతాయి. లెగ్దా డిజైన్ స్టూడియోకు వ‌స్తే ఫ్యాష‌న్ అవ‌స‌రాల‌న్నీ తీరుతాయి." అని అన్నారు.   
 
మాజీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. ''మహిళా సాధికారత సాధిస్తేనే దేశం ముందుకు వెళుతుంది. ఆధునిక యువ‌త మెచ్చే ఫ్యాష‌న్స్ అందించేందుకు దివ్య కర్నాటి త‌న స్వ‌యంకృషితో 'లెగ్దా డిజైన్ స్టూడియో' ప్రారంభించ‌డం అభినంద‌నీయం. పేషెంట్‌ను ప‌రిక్షించి డాక్ట‌ర్ మందులు ఇచ్చిన‌ట్టే, రూపురేఖ‌ల‌ను బ‌ట్టి స‌ద‌రు వ్య‌క్తికి స‌రైన ఫ్యాష‌న్ దుస్తుల‌ను రూపొందించే 'లెగ్దా డిజైన్ స్టూడియో' ప్ర‌తి ఒక్క‌రి అవ‌స‌రాల‌ను తీర్చే విధంగా ఉంది.'' అని అన్నారు.
 
'లెగ్దా డిజైన్ స్టూడియో' నిర్వ‌హ‌కురాలు దివ్య కర్నాటి మాట్లాడుతూ – "ఈ త‌రం యువ‌త‌కు, పిల్ల‌ల‌కు, వైవిధ్యాన్ని కోరుకునే ప్ర‌తి ఒక్క‌రికీ సృజనాత్మకతను జత చేస్తూ 'లెగ్దా డిజైన్ స్టూడియో అంద‌మైన ఆధునిక డిజైన్‌లు అందిస్తోంది. మా క‌స్ట‌మ‌ర్‌ల నుంచి వ‌స్తున్న అద్భుత‌ స్పంద‌న మాకు ఈ రెండ‌వ బ్రాంచీకి శ్రీకారం చుట్టేలా చేసింది. మా రెండ‌వ బ్రాంచీని ప్రారంభించ‌డానికి వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికి మా హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు." అని అన్నారు.    
 
2015లో కేవలం ఇద్దరు ఉద్యోగులతో ప్రారంభమైన ఈ స్టూడియోను దివ్య కర్నాటి స్థాపించారు. ఫ్యాషన్ డిజైనింగ్‌లో పట్టాభిషేకం పొందిన దివ్య కర్నాటి నేడు 30 మందికి పైగా నిపుణులతో కలిసి ‘లెగ్దా’ను మహిళా సాధికారతకు ప్రతీకగా నిలిపారు. మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ లక్షలాది కస్టమర్ల విశ్వాసాన్ని పొందిన ఈ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దివ్య కర్నాటి IKFW – Indian Kids Fashion Weekలో 30 మంది పిల్లల డ్రెస్ డిజైన్ చేసినందుకు బెస్ట్ ఫ్యాషన్ డిజైనర్ అవార్డు, మరో సంస్థ ద్వారా నంది అవార్డు అందుకోవడం ఆమె ప్రతిభకు నిదర్శనం.
 
ఈ కొత్త బ్రాంచ్‌లో కేవలం డ్రెస్‌లు మాత్రమే కాకుండా, మహిళలు, పురుషులు, పిల్లలందరికీ అనుగుణంగా మ్యాచింగ్ అయ్యే వన్ గ్రాము గోల్డ్ ఆభరణాలు, అలంకరణ సామాగ్రి, ట్రెండింగ్ వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. వివిధ శుభకార్యాల కోసం కావలసిన అన్ని రకాల ఆకర్షణీయ వస్తువులు వినియోగదారులను అలరిస్తాయి.
 
ఈ ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మంలో హీరోయిన్ అనన్య నాగళ్ల, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఎన్‌విఎస్ఎస్ ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు దర్గా దయాకర్, బీఆర్ఎస్ నాయకులు మంద సంజీవరెడ్డి,  గౌడ హాస్టల్ ప్రెసిడెంట్ మోతె చక్రవర్తి గౌడ్, నాగోల్ సుప్రజ హాస్పిటల్ MD సిగా విజయకుమార్ గౌడ్, ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్,GBN ఫౌండర్, ప్రెసిడెంట్ చీకటి ప్రభాకర్ గౌడ్,  పలువురు ప్రముఖులు,సంజయ్ జైన్, దర్గా దయాకర్ రెడ్డి, M నరేష్ గౌడ్ రాజకీయ నాయకులు, మోడ‌ల్స్, మహిళలు, పిల్ల‌లు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకను క‌ల‌ర్‌ఫుల్‌గా మార్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Prabhas: ప్రభాస్ తో మారుతీ ప్రేమకథాచిత్రం రీమేక్ చేస్తున్నాడా?