పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు నటనే కాదు, ఆయనకు వయొలెన్ వాయిండచమూ, బుక్ రీడర్ లాంటి కోణాలున్నాయని సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ప్రశంసించారు. ఈరోజు పవన్ కళ్యాణ్ ను హరిహర వీరమల్లు టీమ్ తో కలిశారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన చర్చ జరిగింది. సీతారామశాస్త్రిగారు మీ గురించి ఓ విషయం చెప్పేవారు. పవన్ కళ్యాణ్ లో అందరికీ నటుడిగానే తెలుసు. కానీ ఆయన మంచి బుక్ రీడర్. అందుకే మీకు నేను రాసిన కొన్ని అమూల్యమైన వివరాలురాసి మీకు బుక్ ఇస్తున్నానని అందజేశారు.
Keeravani presents book to Pawan
అనంతరం పవన్ మాట్లాడుతూ, మీరు సంగీతంలో ముందు నేర్చుకున్నదీ ఏదీ? అని అడగా. వయెలెన్ అన్నారు. వెంటనే.. కీరవాణి..గారు. మీకు వయొలెన్ కూడా వచ్చుగదా అంటూ. పవన్ చేతికి వయొలెన్ ఇచ్చారు. ఆ తర్వాత ఆస్కార్ అవార్డును పవన్ కు చూపిస్తూ, మరోసారి పవన్ చేతులమీదుగా అందుకోవడం చాలాా గౌరవంగా భావిస్తున్నట్లు కీరవాణి తెలిపారు. రేపు హైదరాబాద్ లో హరిహర వీరమల్లు సినిమాలోని మూడో పాటను విడుదలచేస్తున్నారు. ముందుగా ఈరోజు పవన్ కళ్యాణ్ ను కలిసి టీమ్ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.
మనలోని పౌరుషం… వీరత్వం ఎన్నటికీ చల్లబడిపోకూడదు అని ప్రతి ఒక్కరినీ తట్టిలేపే- సలసల మరిగే నీలోని రక్తమే... అని పాటకు సంగీత, సాహిత్యాలతో ప్రాణం పోశారు శ్రీ కీరవాణి గారు. హరిహర వీరమల్లులో ఈ గీతం వినిపిస్తుంది. నేటి పరిస్థితులలో మనందరిలో వీరత్వం చేవజారిపోకూడదని చర్నాకోలతో చెప్పినట్లు అనిపించింది. ఈ పాటను 21వ తేదీన అందరికీ విన్పించబోతున్నారు. హరిహర వీరమల్లు చిత్రానికి కీరవాణి గారు అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఆ చిత్ర కథలోని భావోద్వేగాలను శిఖర స్థాయికి తీసుకువెళ్తాయి. ఈ సినిమా కోసం ఎంత తపన చెంది స్వరాలు అందించారో స్వయంగా చూశాను. వీరమల్లుకి ప్రాణం పోశారు అంటే అతిశయోక్తి కాదు. మొదటిసారి మీతో చేస్తున్నాను అంటే... అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టు ఉండాలి కదా అనడం కీరవాణి గారిలో అంకిత భావాన్ని తెలియచేస్తోంది.
ఈ రోజు ఉదయం ఆస్కార్ గ్రహీత కీరవాణి గారిని కలిసి సాగించిన సంభాషణ ఎంతో సంతోషాన్ని కలిగించింది. సంగీత దర్శకులు చక్రవర్తి గారి దగ్గర శిష్యరికం నుంచి సరస్వతి పుత్రులైన శ్రీ వేటూరి సుందర రామమూర్తి గారు, శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి వరకూ తనకున్న అనుబంధాన్ని, సంగీత సాహిత్యాల గురించి చెబుతుంటే సమయం తెలియలేదు. కీరవాణి గారి దగ్గర ఉన్న వయొలిన్లు చూసి వాటి గురించి మాట్లాడుకొంటున్నప్పుడు – నేను వయొలిన్ నేర్చుకోవడం, జంట స్వరాల వరకూ నేర్చుకొని వదిలేయడం గుర్తు చేసుకున్నాను. చిదంబరనాథన్ గారు ఇచ్చిన వయొలిన్ ను ఎంత భద్రంగా దాచుకున్నారో చూపించారు కీరవాణి గారు.
తెలుగు కథలను ప్రేమించే కీరవాణి గారు తనకు అమితంగా నచ్చిన 32 కథలను ఒక సంకలనంలా చేసుకొన్నారు. వాటిని నాకు బహూకరించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. అందులో కీరవాణి గారు రాసిన రెండు కథలు కూడా ఉన్నాయి. ఆయన సరిగమలతో బాణీలు కూర్చే కూర్పరి మాత్రమే కాదు... చక్కటి తెలుగు పదాలతో గీతాలు అల్లగల నేర్పరి కూడా. తన పదాలతో గీత రచయితలకు మార్గం వేస్తారు. తెరపై కనిపించేది రెండున్నర గంటల సినిమాయే... కానీ కీరవాణి గారు రోజుల తరబడి, నెలల తరబడి ఆ సినిమా కోసం తపనపడతారు. సృజనాత్మక స్వరాలతో మైమరపిస్తూ తెలుగు పాటను ఆస్కార్ వేదికపైకి తీసుకువెళ్లారు.